నాడు కళకళ.. నేడు వెలవెల

17 May, 2019 11:37 IST|Sakshi
కొత్త కొబ్బరి కార్మికుల అభిప్రాయాలను సేకరిస్తున్న సూర్యమణి (అంతరచిత్రం)

అమలాపురం టౌన్‌/అంబాజీపేట: కోట్లాది రూపాయల లావాదేవీలతో ఒకప్పుడు అంబాజీపేట కొబ్బరి మార్కెట్‌ దేశంలో మంచి పేరుగడించింది. కేరళలోని అలెప్పీ మార్కెట్‌ తర్వాత స్థానం దీనిదే. 20 ఏళ్ల క్రితం ఇక్కడ 107 కొత్త కొబ్బరి దుకాణాలు ఉండేవి. 2వేల మందికి పైగా కొబ్బరి కార్మికులు ఇక్కడ ఉపాధి పొందేవారు. కొబ్బరి ఉత్పత్తుల్లో తమిళనాడు రాష్ట్రం దూసుకురావడం,  కర్ణాటకకు సైతం కొబ్బరి పంట విస్తరించడంతో  ఈ మార్కెట్‌ ఘన కీర్తి కరుగుతూ వచ్చింది.  నేడు ఇక్కడ కొత్త కొబ్బరి దుకాణాలు 20 మాత్రమే ఉన్నాయి. వీటిని నమ్ముకుని జీవించే కొబ్బరి కార్మికులు పని దొరకని అభద్రతా భావం అలుముకుంది.  అంబాజీపేట కొబ్బరి మార్కెట్‌... కొత్త కొబ్బరి కార్మికుల జీవన íస్థితుగతులపై అంబాజీపేట శివారు కొర్లపాటివారిపాలేనికి చెందిన సూర్యమణి పరిశీలన చేసి ఆ వివరాలను సేకరించింది. కొబ్బరి కార్మికుల శ్రమైక జీవనంలోకి తొంగి చూసి వారి మనోభావాలను, అభిప్రాయాలను సేకరించింది.

 భట్లపాలెం బీవీసీ ఇంజినీరింగ్‌ కళాశాల  హ్యూమన్‌ రిసోర్స్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ గోకరకొండ నాగేంద్ర సూచనలతో ఆమె ఈ ప్రాజెక్ట్‌ చేపట్టంది.  సూర్యమణి తన 45 పేజీల ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ను కళాశాలకు సమర్పించింది. ఆమె పరిశీలనలో వెల్లడైన వివరాలు..  రెండు దశాబ్దాల కిందటి అంబాజీపే కొబ్బరి మార్కెట్లోని 107 కొత్త కొబ్బరి దుకాణాల్లో దుకాణానికి  సగటున 20 మంది కొత్త కొబ్బరి కార్మికులు ఉండేవారు. ప్రస్తుతం 20 దుకాణాలకు తగ్గిపోవడంతో కొందరు సంప్రదాయంగా తమకు తెలిసిన ఈ వృత్తిలోనే కష్టమైనా...నష్టమైనా ఉండిపోయారు. మరికొందరు చేతి నిండా పనులు లేక తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు వలస వెళ్లి అక్కడ కొబ్బరి కార్మికులుగా జీవనం సాగిస్తున్నారు. ఇంకొందరు ఇతర వృత్తుల్లో ఉపాధి వెతుక్కున్నారు. ప్రస్తుతం ఉన్న 20 దుకాణాల్లో దాదాపు 200 మంది కార్మికులు పని చేస్తున్నారు. వారికి వచ్చే వేతనాలతో కుటుంబ పోషణ సాఫీగానే సాగిపోతున్నా ఇళ్లలో ఏవైనా శుభకార్యక్రమాలు జరిగినా, దురదృష్టవశాత్తు అనారోగ్యం పాలైనా ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.  

అంబాజీపేట కొబ్బరి మార్కెట్‌ 20 ఏళ్ల క్రితం వరకూ దేశంలో కీలక స్థానంలో ఉండేది. కేరళలోని అలెప్పీ మార్కెట్‌ తర్వాతి స్థానం ఈ మార్కెట్‌దే. అయితే అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో ఇది నేల చూపు చూసింది. ఆ ఘనకీర్తి మసకబారింది. దీనిపై ఆధారపడిన కార్మికులు గత్యంతరం లేక వలసబాట పట్టారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

దైవసాక్షిగా.. ప్రమాణస్వీకారం చేసిన జిల్లా ఎంపీలు

‘ఫేస్‌బుక్‌’ ఫొటో పట్టించింది

మన్యంలో ఏనుగు భీభత్సం

అన్నింటా మోడల్‌

పీజీ ప్రవేశాలు..చాలా లేజీ

బసవన్న రాజసం..రైతన్న సంబరం

అనుమానాస్పద స్థితిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి మృతి

పరిటాల దోపిడీ అనంతం

రైతు కష్టార్జితాన్ని ఎత్తుకెళ్లారు

తాగొచ్చా..ఐతే ఏంటి?!

మిస్టరీగానే తెలుగు కుటుంబ మరణాలు

ఆరోగ్యశ్రీ వర్తించదని పిండేశారు!

ప్రతిపక్షంగా మంచి సూచనలు చేయండి

ఏపీ ఎంపీల ప్రమాణ స్వీకారం

అభివృద్ధి, సంక్షేమాలే గెలిపించవు 

ఆ తనిఖీతో మాకేంటి సంబంధం?

ఫిరాయింపులను ప్రోత్సహించి రాజ్యాంగాన్ని అవమానించారు

ఆ ఐదు కాలేజీల వైపే విద్యార్థుల మొగ్గు..!

ఐదేళ్లలో మీరు చేసిందేమిటి?

20న పోలవరానికి సీఎం జగన్‌

పొగాకు రైతును ఆదుకోవాల్సిందే

రైతన్నకు కొత్త ‘శక్తి’

శారదా పీఠం ఉత్తరాధికారిగా స్వాత్మానందేంద్ర 

గోదావరి జలాలతో తెలుగు నేల తడవాలి

‘బెల్ట్‌’ తీయాల్సిందే

ఒక్క క్లిక్‌తో న్యూస్‌ రౌండప్‌..

అచ్చెన్నాయుడు ఇంకా మారలేదు: శ్రీకాంత్ రెడ్డి

లోకేశ్‌ దుష్ప్రచారం చేస్తున్నారు: హోంమం‍త్రి సుచరిత

శ్రీ శారదా పీఠం ముందే చెప్పింది

అవినీతి రహిత పాలనను అందిస్తాం: డిప్యూటి సీఎం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సగం పెళ్లి అయిపోయిందా?

ప్రయాణం మొదలు

గురువుతో నాలుగోసారి

పచ్చడి తిని ఆఫీసుకెళ్లారు

రాజా నరసింహా

ఆ నమ్మకంతోనే కల్కి విడుదల చేస్తున్నాం