సర్కస్ ఫీట్లు కాదు..బతుకు పాట్లు

14 Jun, 2015 08:50 IST|Sakshi
సర్కస్ ఫీట్లు కాదు..బతుకు పాట్లు

కొనకనమిట్ల (ప్రకాశం) : నాలుగు రూపాయలు సంపాదించాలంటే సాహసం చేయాలి. యాభై అడుగుల ఎత్తున్న తాటిచెట్లు ఎక్కి తాటాకు కొట్టాలంటే అంతకు మించి ధైర్యం ఉండాలి. కొనకనమిట్ల మండలంలో ఎక్కువగా తాటాకు వ్యాపారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కూలీల చేత తాటాకు కొట్టిచ్చి దానిని గుంటూరు, విజయవాడ లాంటి నగరాలకు తరలిస్తుంటారు. ఈ క్రమంలో చినమనగుండం, లింగంగుంట గ్రామాలకు చెందిన వెంకటేశ్వర్లు, బాలయ్యలు ఎంతో ధైర్యంగా చెట్లు ఎక్కి తాటాకు కొడుతున్నారు.

ఇక్కడ విశేషమేంటంటే చెట్టు దిగకుండా కర్ర సాయంతో పాకుకుంటూ మరో చెట్టుకు చేరి ఆకు దించుతారు. పొట్టకూటి కోసం ఇలాంటి పనులు చేయక తప్పదని వెంకటేశ్వర్లు, బాలయ్యలు అంటున్నారు.                                          

మరిన్ని వార్తలు