టీడీపీ సభ్యులు ప్రజాస్వామ్య వాదులేనా?

23 Jan, 2020 15:14 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: శాసన మండలి చైర్మన్‌ తన విచక్షణాధికారాలతో బిల్లును సెలక్ట్‌ కమిటీకి పంపడం శాసన మండలి చరిత్రలోనే ఇదే మొదటిసారని ఏయూ పొలిటికల్‌ సైన్స్‌ విశ్రాంతాచార్యులు ప్రొఫెసర్‌ కె.రవి అన్నారు. ప్రాంతీయ సమానాభివృద్ధి, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులను నిబంధనలకు విరుద్ధంగా శాసనమండలి చైర్మన్‌ ఎంఏ షరీఫ్‌ సెలెక్ట్‌ కమిటీకి పంపించడాన్ని ఆయన తప్పుపట్టారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు శాసన మండలి చైర్మన్‌ ఎంఏ షరీఫ్‌ను ప్రభావితం చేసేలా వ్యవహరించడం తప్పని మండిపడ్డారు.

ఇది ప్రజాస్వామ్య మూల సూత్రాలకు విరుద్ధమని ప్రొఫెసర్‌ రవి పేర్కొన్నారు. టీడీపీ సభ్యుల తీరు చూస్తే అసలు వీరు ప్రజాస్వామ్య వాదులేనా, వీరికి ప్రజాస్వామ్యం మీద నమ్మకముందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. ప్రతిపక్షాల వైఖరి సరైంది కాదని విమర్శించారు. ప్రజాస్వామ్య ప్రత్యామ్నాయాలను ఆశ్రయించకుండా వికృత చేష్టలతో గొడవకు దిగి బిల్లును ఆపడం అప్రజాస్వామికమే అవుతుందని ఎద్దేవా చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ఆమోదించకుండా తిరోగమనం చెందటం ప్రజలకు నిరాశాజనకమని పేర్కొన్నారు.

చదవండి:

ఇది తప్పే..

సెలెక్ట్‌ కమిటీకి ఎలా పంపుతారు?

మరిన్ని వార్తలు