హెడ్‌ కానిస్టేబుళ్లకు ఏఎస్సైలుగా పదోన్నతి

23 Sep, 2017 15:00 IST|Sakshi

గుంటూరు(పట్నంబజారు) : గుంటూరు రూరల్‌ జిల్లా పరిధిలో హెడ్‌కానిస్టేబుల్‌ నుంచి ఏఎస్సైలుగా పదోన్నతి పొందిన వారికి పోస్టింగ్‌ ఇస్తూ రూరల్‌ ఎస్పీ సి.హెచ్‌.వెంకటప్పలనాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని ఆయన చాంబర్‌లో సమీక్ష నిర్వహించారు. యడ్లపాడులో పని చేస్తున్న షేక్‌ మొహమ్మద్‌ అక్బర్‌ ఆలీని సత్తెనపల్లి పట్టణానికి, నరసరావుపేట రూరల్‌లో ఎం.ఆంథోనిని నరసరావుపేట –2 స్టేషన్‌కు, రూరల్‌ సీసీఎస్‌లో ఉన్న ప్రభాకరరావును సీసీఎస్‌కు, అమరావతిలో ఉన్న కె.మోహన్‌రావును చిలకలూరిపేట టౌన్‌కు, డీఎస్‌బీలో ఉన్న డీవై కోటేశ్వరరావును యడ్లపాడుకు, నిజాంపట్నంలో ఉన్న డి.శ్రీనివాసరావును తెనాలి –2 టౌన్‌కు, యడ్లపాడులో ఉన్న శివయ్యను తెనాలి –2టౌన్‌కు, తెనాలి–1 టౌన్‌లో ఉన్న నాగమల్లేశ్వరరావును తెనాలి –2టౌన్‌కు నియమించారు.

కారంపూడిలో ఉన్న ఏ.ఎల్‌.వీ.ఎస్‌.ప్రసాదరావును నరసరావుపేట రూరల్‌కు, కొల్లూరులో ఉన్న ఓ.సామ్రాజ్యం కొల్లూరుకు, దుగ్గిరాలలో ఉన్న షేక్‌ కరిముల్లాను వేమూరుకు, నాదెండ్లలో ఉన్న టి.వెంకటేశ్వరరెడ్డిని పొన్నూరు టౌన్‌కు, మాచర్ల టౌన్‌లో ఉన్న సయ్యద్‌ రవూఫ్‌ను మాచర్ల రూరల్‌కు, పిడుగురాళ్లలో ఉన్న షేక్‌. సుభానిని సత్తెనపల్లి రూరల్‌కు, పిడుగురాళ్లలో ఉన్న ఎ.వెంకటేశ్వరరావును క్రోసూరుకు, పిడుగురాళ్లలో ఉన్న కె.శ్యామ్‌సన్‌ను దాచేపల్లికి, రెంటచింతలలో ఉన్న సి.హెచ్‌.వెంకటేశ్వరరావును బెల్లంకొండకు, అర్బన్‌ పరిధిలోని కె.శ్రీనివాసరావుకు అమరా వతి, ఎస్‌.కరీముల్లాకు పొన్నూరు టౌన్, కె.మహేశ్వరరావుకు టి.చుం డూరు, సీసీఎస్‌ గుంటూరు రూరల్‌లో ఉన్న వై.శ్రీనివాసరావును తెనాలి –1టౌన్‌కు నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

పలువురు ఎస్సైలకు బదిలీలు
గుంటూరు రేంజ్‌ పరిధిలోని పలువురు ఎస్సైలను బదిలీ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఏఎస్సైల నుంచి ఎస్సైలుగా పదోన్నతి పొందిన జె.సురేష్‌బాబు గుంటూరు రూరల్‌లో ఉండగా అర్బన్‌కు, షేక్‌ మస్తాన్‌వలి అర్బన్‌కు, నెల్లూరులో ఉన్న ఎం.సంపూర్ణ, పి.వెంకటసుబ్బారావు, కె.వెంకటాద్రినాయుడు, టి.మధుసూదనరావులను గుంటూరుకు బదిలీ చేశారు. జిల్లాల వారీగా నెల్లూరుకు చెందిన డి.దుర్గాప్రసాద్‌ను ప్రకాశం జిల్లాకు, గుంటూరు అర్బన్‌లో ఉన్న వై.వీనయ్య నెల్లూరు జిల్లాకు, అర్బన్‌లో ఉన్న ఎన్‌.శ్రీనివాసరెడ్డిని గుంటూరు రూరల్‌ జిల్లాకు, గుంటూరు రూరల్‌ జిల్లాలో ఉన్న ఆర్‌.సుబ్రహ్మణ్యంను నెల్లూరు జిల్లాకు బదిలీ చేశారు. వీరితోపాటుగా మరో 19 మంది ఎస్సైలకు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా