సోలార్ విద్యుత్తుకు ప్రోత్సాహం

13 Feb, 2014 01:17 IST|Sakshi
సోలార్ విద్యుత్తుకు ప్రోత్సాహం
  • మంత్రి గంటా వెల్లడి
  •  డెయిరీ ఆధ్వర్యంలో అతిపెద్ద సౌర విద్యుత్ వ్యవస్థ ప్రారంభం
  •  వ్యయం రూ. 7.5 కోట్లు; ఉత్పత్తి శక్తి 1.15 మెగావాట్లు
  •  విశాఖపట్నం, న్యూస్‌లైన్ : ఇప్పటికే రాష్ట్రంలో విద్యుత్ కొరత అధికంగా ఉందని, దీనిని దృష్టిలో పెట్టుకుని పర్యావరణహిత సోలార్ విద్యుత్ ప్లాంట్లను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఓడరేవుల, మౌలిక వసతుల కల్పన మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు.విశాఖడెయిరీలో సౌరశక్తి వ్యవస్థను  బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డెయిరీ చైర్మన్ తులసీరావు వినూత్న ప్రయోగానికి నాంది పలికారని ప్రశంసించారు. విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని సోలర్ విద్యుత్ ప్లాంట్‌ను నిర్మించడానికి చొరవ తీసుకోవడం అభినందనీయమని చెప్పారు.

    విశాఖడెయిరీలో ఏ క్షణంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయినా తీవ్ర నష్టం వాటిల్లుతుందని, అటువంటి సమస్యను సౌర విద్యుత్తుతో అధిగమించవచ్చని చెప్పారు. విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు మాట్లాడుతూ హైదరాబాద్‌కు చెందిన రెనిన్ సోలర్ సంస్థ సౌజన్యంతో సుమారు ఏడున్నర కోట్ల వ్యయంతో ఐదు ఎకరాల విస్తరణలో దీన్ని నిర్మించినట్టు తెలిపారు. 1.15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని పొందవచ్చని చెప్పారు. మరో రెండు చోట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. సోలార్ విద్యుత్‌ప్లాంట్ వల్ల  ఎలాంటి కాలుష్య వాతావరణం చోటుచేసుకోదని, ప్రతి ఒక్కరూ సోలార్ విద్యుత్‌ను వినియోగించే దిశగా ఆలోచించాలన్నారు.

మరిన్ని వార్తలు