ఏపీలో సీనియర్‌ సివిల్‌ జడ్జీలకు పదోన్నతి

6 Sep, 2019 19:34 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో పలువురు సీనియర్‌ సివిల్‌ జడ్జీలకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. సీనియర్‌ సివిల్‌ జడ్జీలకు జిల్లా జడ్జీలుగా పదోన్నతి కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జాబితాలో 16 మంది సీనియర్‌ సివిల్‌ జడ్జీలకు చోటు దక్కింది.

పదోన్నతి పొందిన సీనియర్‌ సివిల్‌ జడ్జీల జాబితా..
1. కర్నూలు జిల్లా ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జిగా పనిచేస్తున్న ఎం మెజెస్‌
2. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సీనియర్‌ సివిల్‌ జడ్జిగా ఉన్న వి నరేష్‌
3. తూర్ప గోదావరి జిల్లా కాకినాడ ప్రన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జిగా ఉన్న అమ్మనరాజా
4. ప్రకాశం జిల్లా ఒంగోలు ఆడిషనల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జిగా ఉన్న ఆర్‌ శరత్‌బాబు
5. అనంతపురం జిల్లా కదిరి సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎస్‌ రమణయ్య
6. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి అడిషనల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి పి వాసు
7. విజయనగరం జిల్లా విశ్రాంత సీనియర్‌ సివిల్‌ జడ్జి కె రాంబాబు
8. ప్రకాశం జిల్లా పర్చూరు సీనియర్‌ సివిల్‌ జడ్జి షేక్‌ మహమ్మద్‌ ఫజుల్లా
9. గుంటూరు జిల్లా ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి డి లక్ష్మి
10. చిత్తూరు జిల్లా తిరుపతి ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి డి ఏడుకొండలు
11. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు సీనియర్‌ సివిల్‌ జడ్జి వీఎస్‌ఎస్‌ శ్రీనివాస శర్మ
12. కడప జిల్లా డిస్ట్రిక్‌ లెవల్‌ సర్వీసెస్‌ అథారిటీ, సెక్రటరీ సీఎన్‌ మూర్తి
13. కృష్ణా జిల్లా విజయవాడ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ జీ భూపాల్‌రెడ్డి
14. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ థర్డ్‌ అడిషనల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎం మాధురి
15. చిత్తూరు ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి పీవీఎస్‌ సత్యనారాయణ మూర్తి
16. నెల్లూరు జిల్లా గూడూరు సీనియర్‌ సివిల్‌ జడ్జీ కే సీతారామ కృష్ణారావు

మరిన్ని వార్తలు