అప్పటి టీకాలే ఎప్పటికీ రక్ష 

22 Jul, 2020 03:31 IST|Sakshi

క్రమం తప్పని వ్యాధినిరోధక టీకాలతో దశాబ్దాల పాటు రక్షణ 

ఏడాది పాటు బిడ్డకు తల్లిపాలు ఇస్తే ఇమ్యూనిటీ అదనం

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న కొద్దీ జనం టీకాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు టీకా వస్తుందా.. ఎప్పుడు ఈ మహమ్మారి బారి నుంచి తప్పించుకుంటామా అని ఆశతో ఉన్నారు. ఇన్నాళ్లూ టీకా అంటే పట్టించుకోని అనేక మందికి ఇప్పుడు టీకా విలువ తెలిసింది. అయితే టీకా గురించి వైద్యులు మరో ముఖ్యమైన విషయం చెబుతున్నారు. పుట్టినప్పటినుంచిక్రమం తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు వేయిస్తే.. పెద్దయ్యాక కూడా అవి వైరల్‌ ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి కాపాడుతాయని చెబుతున్నారు. 

► ఒక్కరోజు వయసున్న శిశువు నుంచి మూడేళ్ల వరకూ అన్ని రకాల వ్యాధినిరోధక టీకాలూ ఇవ్వాలి. 
► ఈ టీకాలు చాలా ఏళ్లు పనిచేస్తాయని వైద్యులునిర్ధారించారు. 
► తట్టు, బీసీజీ, రుబెల్లా వంటి వాటికి వేయిస్తున్న టీకాలు దశాబ్దాల పాటు ప్రభావం చూపిస్తాయి. 
► ఈ టీకాల వల్ల వ్యాధినిరోధక శక్తి పెంపొందుతుంది. కరోనా వైరస్‌ ప్రభావం కూడా వారిపై తక్కువగా ఉంటుంది. కొంతమంది 40 ఏళ్లు పైబడినవారు ఇప్పుడు ఈ వ్యాధినిరోధక టీకాలు వాడాలని చూస్తున్నారు..కానీ ఈ వయసులో అవి పనిచేయవు. 
► అన్ని రకాల వ్యాధినిరోధక టీకాలతో పాటు ఏడాది పాటు బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం వల్ల కూడా అద్భుతమైన ఇమ్యూనిటీ ఉంటుంది.  

>
మరిన్ని వార్తలు