మోదీ రాకను నిరసిస్తూ నిరసనలు

26 Dec, 2018 14:55 IST|Sakshi

సాక్షి, అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటనను నిరసిస్తూ జనవరి ఐదున రాష్ట్ర వ్యాప్యంగా వామపక్ష పార్టీలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. బుధవారం జరిగిన 9 వామపక్ష పార్టీల ఉమ్మడి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని, రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులను ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదని ఆయన మండిపడ్డారు. ఈనెల 28న కరువు బంద్‌ను పాటిస్తున్నట్లు వివిధ పార్టీల నేతలు ప్రకటించారు. అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రామకృష్ణ ఆరోపించారు. 

సొంత ప్రయోజనాల కోసమే టీడీపీ ప్రభుత్వం శ్వేత పత్రాన్ని విడుదల చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు మండిపడ్డారు. రాష్ట్రంలో ఉ‍న్న ఏడు యూనివర్సిటీలకు వీసీలు లేరని, 60 శాతం పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేరని ఆయన విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న తమపై కేసులు పెట్టి అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. విభజన హామీల అమలు కోసం జనవరి 4న పార్లమెంట్‌ ముందు ధర్మా చేస్తున్నట్లు మధు ప్రకటించారు.

మరిన్ని వార్తలు