దాడికి నిరసనగా రాస్తారోకో

6 Jan, 2014 03:26 IST|Sakshi
 జంగారెడ్డిగూడెం, న్యూస్‌లైన్ :సిటీకేబుల్ కార్యాలయంపై దాడిని నిరసిస్తూ ఆదివారం స్థానిక బోసుబొమ్మ సెంటర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, వైసీపీ, టీడీపీ నాయకులు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. భవిష్యత్తులో ఇటువంటి దాడులు జరగకుండా బాధితులపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. ఈ సందర్భంగా సిటీకేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్తలు శనివారం రాత్రి సిటీకేబుల్ కార్యాలయంపై దాడి చేసి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారన్నారు. వారు ఇచ్చిన సమాచారాన్ని ప్రచారం చేయలేదనే కోపంతో సుమారు 25 మోటార్ సైకిళ్లపై వచ్చిన యువకులు ఈ దాడికి పాల్పడ్డారని చెప్పారు. అంతే కాకుండా తాను కుటుంబసభ్యులతో కలిసి కారులో వెళుతుండగా దాడిచేసేందుకు ప్రయత్నించారన్నారు. ఈ ఘటనలపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు చనమాల శ్రీనివాసరావు, బీవీఆర్‌చౌదరి, పోల్నాటి బాబ్జి, రావూరి కృష్ణ, మంగారామకృష్ణ, కేమిశెట్టి మల్లిబాబు, పి.శ్రీనివాస్, టీడీపీ నాయకులు షేక్‌ముస్తఫా, రామ్‌కుమార్, ప్రింట్‌మీడియా ప్రతినిధులు వాసా సత్యనారాయణ, పసుమర్తి సాయి, ఎలక్ట్రానిక్ మీడియా సిటికేబుల్ బాలు, రామకృష్ణ, అచ్యుత శ్రీనివాసరావు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు