26 నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ47 కౌంట్‌డౌన్‌

24 Nov, 2019 04:25 IST|Sakshi

సూళ్లూరుపేట : శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి 27న ఉదయం 9.28 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ47ను ప్రయోగించనున్నారు. వెహికల్‌ అసెంబ్లింగ్‌ బిల్డింగ్‌లో నాలుగు దశల రాకెట్‌ అనుసంధానం పూర్తయ్యాక అక్కడి నుంచి ప్రయోగ వేదిక మీదకు తరలించే క్రమంలో పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌లోని ఎలక్ట్రానిక్స్‌ వ్యవస్థలో నాయిస్‌ రావడాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు ఈ సమస్యను శుక్రవారం సరిచేశారు.

శనివారం ఉదయం పీఎస్‌ఎల్‌వీ సీ47 రాకెట్‌ను ప్రయోగ వేదిక మీదకు తీసుకెళ్లి అనుసంధానించారు. ఆదివారం లాంచ్‌ రిహార్సల్స్‌ చేపట్టనున్నారు. 25వ తేదీ తుది విడత మిషన్‌ సంసిద్ధతా సమావేశం (ఎంఆర్‌ఆర్‌), 26 ఉదయం 6.28 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రక్రియ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు