పబ్లిక్‌ డేటాఎంట్రీ.. సూపర్‌ సక్సెస్‌

8 Dec, 2019 05:22 IST|Sakshi

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో పారదర్శకతకు పెద్దపీట

సాక్షి, అమరావతి:  అవినీతి రహిత, పారదర్శక పాలన దిశగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రవేశ పెట్టిన పబ్లిక్‌ డేటాఎంట్రీ (పీడీఈ) విధానం పూర్తిస్థాయిలో విజయవంతమైంది. దస్తావేజు లేఖరుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థిరాస్తి విక్రయ దస్తావేజులను ఎవరికి వారే భర్తీచేసి, ఆన్‌లైన్‌ ద్వారా పంపించే పీడీఈ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం నవంబర్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఏకంగా 6,426 ఆన్‌లైన్‌ దరఖాస్తులు నమోదు కావడం గమనార్హం. 

మరిన్ని వార్తలు