ప్రజలే వైఎస్సార్ కుటుంబానికి అండ

29 Jan, 2014 02:23 IST|Sakshi

ఆత్మకూరు, న్యూస్‌లైన్: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యమా అని మంత్రులైన వారు ఆయన కుటుంబంపై రాక్షసంగా ప్రవర్తిస్తున్నారని, ప్రజలే మహానాయకుడి కుటుంబానికి అండగా నిలబడుతున్నారని వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు.
 
 ఆత్మకూరు నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆత్మకూరులో మంగళవారం పాదయాత్ర నిర్వహించారు. గౌతమ్‌రెడ్డితో కలిసి ఎంపీ మేకపాటి పట్టణంలో పాదయాత్రలో పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని మున్సిపల్ బస్టాండు సెంటర్లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. మహానేత రాజశేఖరరెడ్డి మరణం తర్వాత రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితి నెలకొందన్నారు. రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు తిరిగి కొనసాగాలంటే జగన్ నాయకత్వంలోని ప్రభుత్వమే ఏకైక మార్గమన్నారు. రాజశేఖర్‌రెడ్డి రెక్కల కష్టంతో గెలిచిన ప్రజాప్రతినిధులు ప్రజలను రాచిరంపాన పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
 
 జగన్ ప్రభంజనాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ తెలంగాణ అంశాన్ని ముందుకు తెచ్చిందన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం ఎన్ని కుట్రలు చేసినా జగన్ ప్రభంజనాన్ని అడ్డుకోలేవన్నారు. కాబోయే సీఎం జగన్ అని మేకపాటి అన్నారు. పాదయాత్ర ద్వారా గౌతంరెడ్డి ప్రజా సమస్యలను తెలుసుకున్నారన్నారు. 514కిలోమీటర్ల  నడిచి పల్లె ప్రజల ఇబ్బందులు చాలా దగ్గరగా గమనించారన్నారు. గౌతమ్‌రెడ్డి గెలుపుతో ఆత్మకూరు నియోజకవర్గం అభివృద్ధి పథంలో పయనిస్తుందని చెప్పారు. 514 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తయిన సందర్భంగా నువ్వురుపాడు వైఎస్సార్‌కాంగ్రెస్ నేత గడ్డం శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు.
 
 ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కన్వీనర్  మేరిగ మురళీధర్, మాజీ ఎమ్మెల్సీ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, సిండికేట్ ఫార్మర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ డెరైక్టర్ దేవరపల్లి శ్రీనివాసులురెడ్డి, రామస్వామిపల్లి సర్పంచ్ సానా వేణుగోపాల్‌రెడ్డి, ఆత్మకూరు, సంగం మండలాల కన్వీనర్లు ఇందూరు నారసింహారెడ్డి, ఐవీ కృష్ణారెడ్డి, వైఎస్సార్‌కాంగ్రెస్ నేతలు అల్లారెడ్డి సతీష్‌రెడ్డి, ఆనందరెడ్డి, సూరా భాస్కర్‌రెడ్డి, ఇరగన వెంకటేశ్వరరెడ్డి, గంగవరపు రాములునాయుడు, ఎర్రమళ్ల శంకరరెడ్డి, మందా రామచంద్రా రెడ్డి, వనిపెంట వెంకటసుబ్బారెడ్డి, సోమల మాధవరెడ్డి, మందా చిట్టిబాబు, శేషం హజరత్‌బాబు, రేవూరు వేణుగోపాల్‌రెడ్డి, చెన్ను వెంకటేశ్వర్లురెడ్డి, పందిళ్లపల్లి గోపీరెడ్డి, గడ్డం శ్రీనివాసులురెడ్డి, నాగులపాటి ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు