చుడా చైర్మన్‌గా  పురుషోత్తంరెడ్డి

9 Aug, 2019 10:10 IST|Sakshi

ఉత్తర్వులు జారీచేసిన  రాష్ట్ర ప్రభుత్వం

ఏడాది పాటు పదవీ కాలం

సాక్షి, చిత్తూరు: పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వ్యక్తిని ఉన్నత పదవిలో కూర్చోబెడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా చిత్తూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (చుడా) చైర్మన్‌గా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యుడు కట్టమంచి పురుషోత్తం రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 2005లో జరిగిన మునిసిపల్‌ ఎన్నికల్లో పురుషోత్తం రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ తరఫున చిత్తూ రు మున్సిపల్‌ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆయన్ని మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌గా నియమించారు. 2009లో జరిగిన మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కట్టమంచి నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున కార్పొరేటర్‌గా ఎన్నికై  కా ర్పొరేషన్‌లో ఫ్లోర్‌ లీడర్‌గా ఉన్నారు. పార్టీకి నమ్మకంగా ఉన్న ఈయనకు చుడా చైర్మన్‌ పదవి దక్కడంతో చిత్తూరులోని పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.  ఏడాది కాలంపాటు ఆయన చుడా చైర్మన్‌గా కొనసాగుతారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

మరిన్ని వార్తలు