ముగిసిన పుష్కర సంరంభం

24 Aug, 2016 02:02 IST|Sakshi
ముగిసిన పుష్కర సంరంభం

- హారతితో కృష్ణా ఆది పుష్కరాలకు ముగింపు
- పుష్కర స్నానం చేసిన కేంద్ర మంత్రులు వెంకయ్య, ప్రభు
 
 సాక్షి, అమరావతి : పన్నెండు రోజుల పాటు తెలుగురాష్ట్రాలను భక్తి పారవశ్యంలో ముంచెత్తిన కృష్ణా పుష్కరాలు మంగళవారం ముగిశాయి. విజయవాడ సంగమం ఘాట్ వద్ద హారతితో ఈ ఆది పుష్కరాలకు ముగింపు పలికారు. ఈ పుష్కరాల్లో 1,94,43, 984 మంది పుణ్య స్నానాలు చేశారు. పవిత్ర సంగమం ఘాట్ వద్ద మంగళవారం సాయంత్రం పుష్కరాల ముగింపు వేడుకలను నిర్వహించారు. కాగా, పుష్కరాల చివరి రోజైన రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం 14,95,720 మంది పుష్కర స్నానాలు చేశారు.  పద్మావతి ఘాట్ వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి చక్రస్నానం నిర్వహించింది. 

పుష్కర స్నానాలు చేసిన ప్రముఖుల్లో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సురేష్ ప్రభు, సినీ నటుడు సాయికుమార్, వాయిద్యకారుడు శివమణి తదితరులు ఉన్నారు. ముగింపు వేడుకల్లో సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, సురేష్ ప్రభులతో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఒలింపిక్ పతక విజేత పీవీ సింధూ, ఆమె కోచ్ గోపీచంద్ ముగింపు వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

మరిన్ని వార్తలు