పుత్తూరులో ఆపరేషన్ పూర్తి: కౌముది

5 Oct, 2013 16:16 IST|Sakshi
పుత్తూరులో ఆపరేషన్ పూర్తి: కౌముది

చిత్తూరు జిల్లా పుత్తూరులో ఆపరేషన్‌ పూర్తయింది. ఉగ్రవాదులు బిలాల్‌, ఇస్మాయిల్ అలియాస్ మున్నాను ఆక్టోపస్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని అంబులెన్స్‌లో చెన్నైకు తరలించారు. ఓ మహిళ సహా ముగ్గురు పిల్లలు లొంగిపోగా, వారిని పుత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పుత్తూరు సంఘటనలో తీవ్రంగా గాయపడిన సీఐ లక్ష్మణ్కు చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నట్లు అదనపు డీఐజీ వీఎస్కే కౌముది తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి ఆక్టోపస్ ఆపరేషన్ పూర్తయిందని, బిలాల్ మాలిక్, ఇస్మాయిల్ అనే ఇద్దరు ఉగ్రవాదులతో పాటు ఒక మహిళ, ముగ్గురు పిల్లలను కూడా అదుపులోకి తీసుకున్నామని ఆయన చెప్పారు. సీఐ లక్ష్మణ్ను గాయపరిచిన కేసులో వీరిపై కేసు నమోదు చేసినట్లు అదనపు డీఐజీ కౌముది వివరించారు.

కాగా, ఉగ్రవాదులు తిరుమలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా పేలుళ్లు జరపడానికి కుట్ర పన్నుతున్నట్లు వచ్చిన కథనాల గురించి మాత్రం తమవద్ద ఎలాంటి సమాచారం లేదని కౌముది చెప్పారు. శుక్రవారం రాత్రినుంచి కొనసాగిన ఆపరేషన్.. శనివారం సాయంత్రానికి ముగిసింది. ఉగ్రవాదులున్న ఇంటి గోడలను డ్రిల్లింగ్ చేసి మరీ ఈ ఆపరేషన్ను ఆక్టోపస్ పోలీసులు దిగ్విజయంగా పూర్తిచేశారు.

మరిన్ని వార్తలు