కూల్‌ కూల్‌గా మోసం

7 Jun, 2018 11:13 IST|Sakshi
బాటిళ్లతో పట్టుబడ్డ పిల్లా శ్రీనివాసరావుతో డీఎస్పీ నాయుడు తదితరులు 

సాక్షి,వేపగుంట(గోపాలపట్నం (విశాఖపశ్చిమ) : నాణ్యత పాటించని ఫ్రూట్‌ జ్యూస్‌ షాపుపై  విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దాడి చేశారు. వేపగుంట సాయిమాధవనగర్‌లో పిల్లా శ్రీనివాసరావు శీతల పానీయాల తయారీ కేంద్రం కృప ఏజెన్సీస్‌ పేరిట నిర్వహిస్తున్నాడు. బుధవారం విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీఎస్పీ సీఎంనాయుడు ఆ శాఖ ఎస్‌ఐ రమేష్, ఆహార భద్రతాధికారులు వెంకటరత్నం, శ్రీరాములుతో అక్కడికి వచ్చి తనిఖీలు చేపట్టారు. శీతల పానీయాల తయారీకి శుద్ధి చేసిన నీరు వాడాల్సి ఉండగా, ఇక్కడ మా త్రం బాటిళ్లలో బావిలో నీరుపోసేస్తున్నారు. అందులో మామిడి, ద్రాక్ష రసాలతో పాటు కొద్ది రోజులు నిల్వ ఉండేలా రసాయనాలు కలి పేస్తున్నారు. దీంతో శ్రీనివాసరావును అరె స్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. శాంపిళ్లను హై దరాబాద్‌ సేఫ్టీ ఫుడ్‌ ల్యాబ్‌కు పంపుతున్నట్లు చెప్పారు.  

మరిన్ని వార్తలు