సీఎం జగన్‌పై ఆర్‌ నారాయణమూర్తి ప్రశంసలు 

1 Oct, 2019 14:42 IST|Sakshi

సాక్షి, కర్నూలు : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించకపోవడం అభినందనీయమని సినీ హీరో, ప్రజా ఉద్యమకారుడు ఆర్‌. నారాయాణ మూర్తి అన్నారు. ‘మార్కెట్‌లో ప్రజాస్వామ్యం.. డబ్బుకు బలి అవుతున్న రాజకీయం’ అనే అంశంపై కర్నూలులో బీసీ, ఎస్సీ, మైనార్టీలు సంఘాలు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్‌.నారాయణమూర్తి మాట్లాడుతూ.. ఫిరాయింపుదారులు కచ్చితంగా రాజీనామా చేసి రావాలని సీఎం జగన్ చెప్పడం గొప్ప విషయమని, ఆయన్ని అభినందిస్తున్నానని అన్నారు.

భారత్ లో ప్రజాస్వామ్యం గాడి తప్పిందని, ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారిందని పాలకుల తీరుపై విమర్శలు చేశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదే అన్నారు. స్నేహ చిత్ర బ్యానర్‌పై నిర్మించిన ‘మార్కెట్‌లో ప్రజాస్వామ్యం’  అనే సినిమాను మరోసారి నవంబర్‌ 15న విడుదల చేస్తున్నామని, అందరు ఆదరించాలని కోరారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బ్రహ్మకుమారీస్‌ చీఫ్‌ దాదీ జానకి ఇకలేరు

కరోనా సోకిందేమోనని దంపతుల ఆత్మహత్య 

సరిహద్దుల్లోనే వైద్యపరీక్షలు చేయాలి

విదేశాల నుంచి వచ్చిన వారికి జియోఫెన్సింగ్‌ 

ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోంది

సినిమా

కరోనా విరాళం

వాయిస్‌ ఓవర్‌

ఐటీ మోసగాళ్ళు

కరోనా పాట

ఇంటిపేరు అల్లూరి.. సాకింది గోదారి

చరణ్‌ బర్త్‌డే: ఉపాసననే స్వయంగా..