రచ్చబండ రసాభాస

17 Nov, 2013 03:00 IST|Sakshi
ఏలేశ్వరం, న్యూస్‌లైన్ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏ ఆశయంతో రచ్చబండ ప్రవేశపెట్టా రో దానిని కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడవడంతో అది రచ్చరచ్చగా మారుతోంది. కాం గ్రెస్ నాయకులు తమ స్వార్థప్రయోజనాలకు వాడుకుంటూ మోసం చేయడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏలేశ్వరంలో నిర్వహించిన రచ్చబండను అడుగడుగునా అడ్డుకుంటూ తమ నిరసనలు వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు అధ్యక్షతన నిర్విహ ంచిన రచ్చబండ కు మండలంలోని పలు గ్రామాల నుంచి వందలాదిగా ప్రజలు తరలివచ్చారు. సభపై ఎమ్మెల్యేతో పాటు మరో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీశివకుమారి, మాజీ ప్రజాప్రతినిధులు వరుపుల తమ్మయ్యబాబు, బొదిరెడ్డి గోపాలకృష్ణ, మాజీ సర్పంచ్‌లు పైలసత్యనారాయణ, గారా చంద్రలీలావతి, రచ్చబండ కమిటీ సభ్యులంటూ కాంగ్రెస్ పార్టీ వారిని కూర్చోబెట్టడంతో రభస మొదలైంది.
 
 వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు శిడగం వెంకటేశ్వరరావు సభ వద్దకు చేరుకుని ప్రోట్‌కాల్ పాటించడం లేదని అధికారులను నిల దీశారు. జెడ్పీటీసీ మాజీ సభ్యుడు, సహకార సంఘ అధ్యక్షుడిని సభపైకి పిలవకపోవడంపై అధికారులను నిలదీశారు. వైఎస్సార్ సీపీ నేత అలమండ చలమయ్య మాట్లాడు తూ గతంలో ఇచ్చిన దరఖాస్తులకు ఇంతవరకు న్యాయం జరగలేదని, ప్రస్తుతం ఈ రచ్చబండలోనైనా అర్హులకు న్యాయం చేయాలని కోరారు. సభకు వచ్చిన అర్జీదారులు లేచి నిల బడడంతో కొద్దిసేపు తొక్కిసలాట జరిగింది. వైఎస్సార్ సీపీ నేతలు గొల్లపల్లి బుజ్జి, రాం దాసు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు.  అధికారులకు విన్నవించినా ఫలితం లేదని, అర్జీదారులు తమ అర్జీలను దహనం చేశారు. అనంతరం లబ్ధిదారులకు అనుమతి పత్రాలు ఇచ్చి ముగించారు. తహశీల్దార్ కె.ప్రకాశ్‌బాబు, ఎంపీడీఓ వి.రామకృష్ణ పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు