ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలి

18 Feb, 2019 13:33 IST|Sakshi
వెంగళాయపల్లెలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాచమల్లు

ఎమ్మెల్యే రాచమల్లు

వైఎస్‌ఆర్‌ జిల్లా, రాజుపాళెం :     ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలని, రెండు, మూడు ఓట్లు ఉంటే నేరమని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు. రాజుపాళెం మండలంలోని వెంగళాయపల్లె, అయ్యవారిపల్లె గ్రామాల్లో ఆదివారం ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారంలో విలేకరులతో మాట్లాడారు. అన్ని సవరణల తర్వాత ఎలక్షన్‌ కమిషన్‌ తుది ఓటర్ల జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందేనన్నారు. వాటి ప్రకారం ప్రొద్దుటూరు నియోజకవర్గానికి 2,14,370 ఓట్లు ఉన్నాయన్నారు.

అయితే నియోజకవర్గానికి సంబంధించి 9,871 ఓట్లు అర్హత లేనివి ఉన్నాయని చెప్పారు. ఇందులో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ఓట్లు ఉంటాయన్నారు.  ఎవరిపై విమర్శలు చేయకుండా పార్టీలకతీతంగా, స్వచ్ఛందంగా అర్హత లేని ఓట్లను తొలగించాలని కోరుతున్నామన్నారు. వైఎస్‌ఆర్‌సీపీతో పాటు అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి, స్వచ్ఛమైన రాజకీయాలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్‌ ఏస్‌ఏ నారాయణరెడ్డి, జిల్లా అ«ధికార ప్రతినిధి భాస్కర్, జిల్లా సేవాదళ్‌ ప్రెసిడెంట్‌ ధనిరెడ్డి కిరణ్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు