ధర గోరంత.. చెల్లిస్తోంది కొండంత

25 Feb, 2019 12:21 IST|Sakshi

వ్యత్యాసం సొమ్ము చినబాబు, మంత్రుల ఇళ్లకు

ఆదరణ లబ్ధి టీడీపీ నాయకులకే 

ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి

కొర్రపాడులో ఇంటింటి ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే రాచమల్లు

కడప, రాజుపాళెం: బీసీలకు ఆదరణ పేరుతో ఇచ్చే పనిముట్ల ధరలు గోరంత ఉంటే టీడీపీ నాయకులు వాటికి కొండంత ధర చెల్లించి వ్యత్యాసం డబ్బును చినబాబు, మంత్రుల ఇళ్లకు తరలిస్తున్నారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన రాజుపాళెం మండలం కొర్రపాడులో ఇంటింటి ప్రచారం చేశారు. చేనేత కార్మికుడికి మోటారుకు సంబంధించిన జా కార్డు ఇస్తామని,దరఖాస్తు చేసుకోవాలని  ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఇందుకు లబ్ధిదారుడు తన వాటా కింద 10 శాతం కట్టాలన్నారు.ఒక్కో జా కార్డుకు రూ.18,500 చెల్లిస్తోందన్నారు. ఇందులో 10 శాతం 1,850 లబ్ధిదారులు డీడీలు కట్టారన్నారు. ఇదే జా కార్డును ప్రొద్దుటూరు పురపాలక సంఘం గత ఏడాది ఏడో నెలలో దరఖాస్తు చేసుకున్న చేనేతలకు ఇంత వరకు జా కార్డులు ఇవ్వకపోతే, మా డీడీల సొమ్ము  వెనక్కి ఇవ్వాలని కోరారన్నారు. వారికి తానే జా కార్డును ఇప్పిస్తానని మాట ఇచ్చానన్నారు.

ప్రొద్దుటూరుకు చెందిన వైఎస్‌ఆర్‌సీపీ చేనేత నాయకులను వెంకటగిరికి పంపామన్నారు. అక్కడ రూ.6,500తో 86 కొనుగోలు చేశామన్నారు. మిగిలిన రూ.10,500 చినబాబు ఇంటికి, మంత్రులకు చేరడం లేదా అని ప్రశ్నించారు. ఎవడబ్బ సొమ్ము ఎవడు తీసుకుంటున్నారని మండి పడ్డారు. ఆదరణ పథకం టీడీపీ నాయకుల ఆర్థిక అభివృద్ధికి తప్ప బీసీల అభివృద్ధికి కాదన్నారు. ఈ విషయంపై ఏ మంత్రి, ఏ నాయకుడితోనైనా చర్చకు సిద్ధమన్నారు. బీసీలకు ఇచ్చే సబ్సిడీ రుణాలు పేపర్లకే పరిమితమయ్యాయన్నారు. 50 శాతంతో సబ్బిడీ రుణాల కోసం మున్సిపల్, ఎంపీడీఓ కార్యాలయాల చుట్టూ తిరగటానికే సరిపోతోందన్నారు. నూటికి 80 శాతం సబ్సిడీ రుణాలు మంజూరు కాలేదన్నారు. వ్యక్తిగత రుణాలను బ్యాంకులో ఇప్పించి వారిని ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వం, ఇచ్చిన కొన్ని రుణాలు కూడా జన్మభూమి కమిటీ సభ్యుల సిఫారస్సులతో ఇచ్చినవే అన్నారు. ప్రభుత్వ ఖజానాలోని డబ్బులను పంచుకుంటున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ రంగారెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు దొంతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు