నారాయణ కాలేజీలో ర్యాగింగ్‌.. విద్యార్థులకు వాతలు

9 Jul, 2019 12:34 IST|Sakshi

అనంతపురం: పట్టణంలోని నారాయణ కాలేజీలో ర్యాగింగ్‌ ఘటన కలకలం రేపుతోంది. ర్యాగింగ్‌లో భాగంగా జూనియర్లు, సీనియర్ల మధ్య ఘర్షణ జరగడంతో... కాలేజీ సిబ్బంది రెచ్చిపోయారు. విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టారు. అంతేకాకుండా విద్యార్థులకు కాలేజీ లెక్చరర్లు వాతలు కూడా పెట్టినట్టు తెలుస్తోంది. ఈ గొడవలో పలువురు విద్యార్థులు గాయపడ్డట్టు సమాచారం.

మరిన్ని వార్తలు