‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయి’

8 Oct, 2018 12:53 IST|Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి : నాలుగున్నర సంవత్సరాలలో రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయని ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్‌. రఘువీరారెడ్డి విమర్శించారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలంలోని కాళ్లకూరు గ్రామంలో చేపట్టిన ఇంటింటికి కాంగ్రెస్‌ కార్యక్రమంలో రఘువీరారెడ్డి, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, గాదిరాజు లచ్చిరాజు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రఘువీరా రెడ్డి మాట్లాడుతూ.. రాహూల్‌ గాంధీ ప్రధాని అయిన వెంటనే మొదటి సంతకం ఏపీకి సంబంధించిన ప్రత్యేకహోదా, విభజన హామీల అమలుపై చేస్తారని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం నిరుద్యోగులకు ఇస్తున్నది నిరుద్యోగ భృతి కాదని, యువకులకు పెన్షన్‌ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు