ర్యాగింగ్‌కు పాల్పడితే జీవిత ఖైదు

25 Sep, 2014 01:55 IST|Sakshi

 శ్రీకాకుళం: సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ర్యాగింగ్‌కు గురైన బాధితుడు చనిపోతే బాధ్యులైన వారికి జీవిత ఖైదు లేదా పదేళ్ల జైలుశిక్ష, రూ.50 వేల వరకు జరిమానా విధించడం జరుగుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పి.అన్నపూర్ణ అన్నారు. అభ్యుదయ డిగ్రీ కళాశాలలో బుధవారం న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు చట్టపరమైన, న్యాయపరమైన అవగాహన కలిగి ఉండాలన్నారు సీనియర్లు జూనియర్  విద్యార్థులపై ర్యాగింగ్ పాల్పడితే కఠిన శిక్షలు ఉన్నాయని,  విద్యార్థుల జీవితం పాడవతుందన్నారు.  విద్యాసంస్థల్లో చేరేటప్పుడు తల్లిదండ్రుల నుంచి ర్యాగింగ్‌కు పాల్పడరని హామీ పత్రం, కాలేజీలో ర్యాగింగ్ నిషేధం బోర్డులు పెట్టాలన్నారు.  జిల్లా వినియోగదారుల ఫోరం పూర్వపు అధ్యక్షుడు పప్పల జగన్నాథరావు మాట్లాడుతూ హిందూ, ముస్లిం వివాహం, విడాకులు, స్త్రీ గౌరవం, వరకట్నం, అవినీతి నిరోధక చట్టంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ సభ్యుడు పాలిశెట్టి మల్లిబాబు, కళాశాల కరస్పాండెంట్ పి.భూషణ దేవ్, డెరైక్టర్ ఎం.శంకరరావు, న్యాయవాదులు కిల్లి పాపినాయుడు, జి.ఇందిరా ప్రసాద్, ప్రిన్సిపాల్ బాలముకుందరావు తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు