రైల్వే సిబ్బంది పనితీరుపై డీఆర్‌ఎం ఆగ్రహం

1 Jun, 2014 00:16 IST|Sakshi
రైల్వే సిబ్బంది పనితీరుపై డీఆర్‌ఎం ఆగ్రహం

సామర్లకోట, న్యూస్‌లైన్ :రైల్వే సిబ్బంది పనితీరుపై డివిజనల్ రైల్వే మేనేజర్ ప్రదీప్‌కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. శని వారం విశాఖ  ఎక్స్‌ప్రెస్‌లో సామర్లకోట వచ్చిన ఆయన అన్నవరానికి కుటుంబ సభ్యులతో కారులో వెళ్లా రు. తిరిగి వచ్చిన అనంతరం స్థానిక రైల్వేస్టేషన్‌ను తనిఖీ చేశారు. రైల్వే ట్రాక్ మధ్య డ్రెయిన్‌లో మురుగు నిలిచిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చే శారు. అండర్‌గ్రౌండ్ డ్రెయినేజి ద్వా రా మురుగు పోయేలా ఏర్పాటు చే యాలని ఆదేశించారు. దీనిపై ఇం జనీరింగ్ సిబ్బంది, హెల్త్ సిబ్బం దిని మందలించారు. సిగ్నల్ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
  సిగ్నల్ సెక్షన్ ఇంజ నీర్ అన్వర్‌బాషాను పనితీరు మెరు గు పర్చుకోవాలని సూచించారు. డిప్యూటీ సూపరింటెండెంట్ కార్యాలయంలో రికార్డులు సక్రమంగా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశా రు. ఒకటో నంబరు ప్లాట్ ఫారంపై పార్సిల్ కార్యాలయం వద్ద తాగునీరు వేడిగా రావడం, కుళాయిలు సక్రమంగా పనిచేయక పోవడంపై మండిపడ్డారు. రైల్వే లిఫ్టు వద్ద ఉన్న తాగునీటి ప్రదేశానికి బోర్డు లేకపోవడం, చెత్త ఎక్కువగా ఉండడంతో సిబ్బందిని మందలించారు. స్టేషన్ మేనేజర్ కార్యాలయం, విశ్రాంతి గ దులు, ప్లాట్‌ఫారంను పరిశీలించి, లిఫ్టు పనితీరుపై ఆరా తీశారు.
 
 కాగా జిల్లా మీదుగా ప్రయాణించే రైళ్లకు అదనపు బోగీలు కేటాయించడంపై రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంటుం దని ప్రదీప్‌కుమార్ అన్నారు. పలువురు ప్రయాణికులు ఆయనకు వినతిపత్రాలు సమర్పించారు. రైలుకు కనీసం 4 సాధారణ  బోగీలు ఏర్పా టు చేసి, ముఖ్యమైన రైళ్లు నాలుగు నిమిషాలు ఆగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట సీని యర్ డివిజనల్ మేనేజర్ అమిత్ అగర్వాల్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎన్‌వీవీ సత్యనారాయణ, ఎస్‌డీఎం (ఆపరేషన్స్)  కె. సత్యనారాయణ, స్టేషన్ మేనేజర్ సీహెచ్ సుబ్రహ్మణ్యం, ఏడీఈఎన్ సీహెచ్ తులసీరామ్, పబ్లిక్ వే ఇన్‌స్పెక్టర్ ఆర్.సత్యం, ఇంజనీర్లు సుబ్రహ్మణ్యం, కె.కామేశ్వరరావు, ఆర్పీఎఫ్ సీఐ బి.రాజు, ఏఎస్సై డీవీ నరసింహరావు, రైల్వే ఎస్సై ఎస్.గోవిందరెడ్డి తదితరులు ఉన్నారు. బొకారో ఎక్స్‌ప్రెస్‌లో ఆయన సామర్లకోట నుంచి విజయవాడ వెళ్లారు.
 

మరిన్ని వార్తలు