కోస్తాంధ్రకు వర్ష సూచన

7 Jul, 2018 10:32 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : కోస్తాంధ్రకు భారత వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. వాయువ్య బంగాళాఖాతం ఆనుకొని ఉన్న పశ్చిమ బెంగాల్‌, ఒడిశాలపై ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు విశాఖ తుఫాన్‌ హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీనితో పాటు ఉత్తర ఛత్తీస్‌ఘఢ్‌ పరిసర ప్రాంతాల్లో మరో ఉపరితల ఆవర్తనం ఉన్నట్లు పేర్కొంది. దీంతో నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని.. రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు పడతాయిని తెలిపింది. అక్కడక్కడ ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించిది. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 50 నుండి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తా తీరంలోని సముద్రంలో అల్లకల్లోల పరిస్థితి ఉందని మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.

మరిన్ని వార్తలు