` ముంచెత్తిన వాన

18 Sep, 2014 00:11 IST|Sakshi
ముంచెత్తిన వాన
పిడుగురాళ్ల, కర్లపాలెం: జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు పంట పొలాలను ముంచెత్తుతున్నారుు. వర్షపు నీరు భారీగా చేరటంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నారుు. బుధవారం ఉదయం వరకు జిల్లాలో సగటున 3.83 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో సెప్టెంబర్ నెల సగటు వర్షపాతం 14.54 సెం.మీ. కాగా ఇప్పటివరకు 6.99 సెంటీమీటర్లుగా నమోదైంది. బుధవారం అత్యధికంగా పిట్టలవానిపాలెం మండలంలో 11.92 సెంటీమీటర్ల వర్షం పడింది. పిడుగురాళ్ల బుగ్గవాగులో వరద నీరు ఉద్ధ­ృతంగా ప్రవహించటంతో పిల్లుట్ల రోడ్డు కోతకు గురైంది. సాయంత్రం వరకు రోడ్డు చప్టాపై మోకాలి లోతున నీరు ప్రవహించటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కర్లపాలెం మండలంలోని వందలాది ఎకరాల్లో వరిపైరు నీట మునిగింది. కాలువలకు గండ్లు పడటంతో పేరలిపాడు, తుమ్మలపల్లి నర్రావారిపాలెం, కట్టావాద, పేరలి, పెదగొల్లపాలెం, పేరలి కొత్తపాలెం, చింతాయ పాలెం, సమ్మెటవారి పాలెం గ్రామాల పరిధిలోని వరి పైర్లు నీటమునిగాయి. వర్షం ఇంతటితో ఆగితే పంటకు మేలు జరుగుతుందని రైతులు అంటున్నారు.
 పిట్టలవానిపాలెంలో 11.92 సెం.మీ వర్షం
 కొరిటెపాడు(గుంటూరు): జిల్లాలో బుధవారం ఉదయం వరకు అత్యధికంగా పిట్టలవానిపాలెం మండలంలో 11.92 సెంటీమీటర్లు, అత్యల్పంగా తాడేపల్లి మండలంలో 0.96 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సగటున 3.83 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో సెప్టెంబర్ నెలలో 14.54 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సిఉండగా, ఇప్పటి వరకు 6.99 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి... కర్లపాలెం మండలంలో 9.86 సెం.మీ, మేడికొండూరు 8.06, నగరం 7.50, నిజాంపట్నం 7.04, పొన్నూరు 6.06, అమరావతి 6.02, అచ్చంపేట 5.78, రాజుపాలెం 5.62, అమృతలూరు 5.24, చెరుకుపల్లి 5.16, బెల్లంకొండ 5.12, నకరికల్లు 4.84, వినుకొండ 4.78, బాపట్ల 4.74, దాచేపల్లి 4.72, పిడుగురాళ్ళ 4.54, మాచర్ల 4.42, క్రోసూరు 4.40, పెదకూరపాడు 4.26, గురజాల 4.24, దుర్గి 4.02, సత్తెనపల్లి 3.94, భట్టిప్రోలు 3.94, కారంపూడి 3.84, రెంటచింతల 3.74, యడ్లపాడు 3.38, కొల్లిపర 3.36, ఫిరంగిపురం 3.22, తెనాలి 3.22, ముప్పాళ్ల 3.14, వట్టిచెరుకూరు 3.12, వేమూరు 3.06, రేపల్లే 3.06, తుళ్ళూరు 3.04, చేబ్రోలు 3.02, చిలకలూరిపేట 2.84, ప్రత్తిపాడు 2.80, శావల్యాపురం 2.80, రొంపిచర్ల 2.62, మాచవరం 2.56, కొల్లూరు 2.48, నరసరావుపేట 2.40, బొల్లాపల్లి 2.36, ఈపూరు 2.22, గుంటూరు 2.20, నాదెండ్ల 2.14, నూజెండ్ల 2.04, కాకుమాను 2.00, పెదనందిపాడు 1.98, దుగ్గిరాల 1.92, తాడికొండ 1.82, వెల్దుర్తి 1.42, పెదకాకాని 1.18, చుండూరు 1.18, మంగళగిరి మండలంలో 1.04 సెంటీమీటర్ల వర్షం పడింది.
 
 
 
 

 

మరిన్ని వార్తలు