ఎస్‌కోటలో 6 సెంటిమీటర్ల వర్షపాతం 

11 May, 2020 09:02 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, విశాఖపట్నం: దక్షిణ అండమాన్‌ సముద్రం, దానికి ఆనుకుని సుమత్రా దీవుల తీరంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకొని అండమాన్‌ సముద్రంలో ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్టు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇటీవలే ఈ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినప్పటికీ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో అది బలహీనపడిందని ఐఎండీ అధికారులు తెలిపారు. (విశాఖలో కోలుకుంటున్న ఐదు గ్రామాలు)

మరోవైపు దక్షిణ తమిళనాడు నుంచి కోస్తా వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితలద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రెండు రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా ఎస్‌కోటలో 6 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. అనకాపల్లిలో 3, విశాఖలో 2 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైనట్టు ఐఎండీ అధికారులు తెలిపారు. (చదవండి: గండం నుంచి గట్టెక్కినట్లే..!)

>
మరిన్ని వార్తలు