ముంపులోనే..

30 Jul, 2014 01:42 IST|Sakshi
ముంపులోనే..

 సాక్షి, ఏలూరు : జిల్లాలో రెండు రోజులపాటు విస్తారంగా కురిసిన వర్షాలు మంగళవారం కొంత శాంతించాయి. మధ్యాహ్నం అక్కడక్కడా జల్లు లు కురిశాయి. కాలువలు, డ్రెయిన్లలో నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. చెరువులు, వాగు లు పొంగుతున్నాయి. డ్రెయిన్లలో తూడు పెరి గిపోవడంతో వర్షం నీరు  ఉప్పుటేరుల్లో కలవడానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని చేలు, జనావాసాల్లో నీరు నిలిచి పోయింది. వ్యాధుల ప్రబలే ప్రమాదం ఉందని ప్రజలు భయపడుతున్నారు. నారుమళ్లలో నిలచిపోయిన నీటిని బయటకు తోడేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. చాటపర్రు చంద్రబాబు నాయుడు కాలనీలో నీరు చేరింది.
 
 పెరవలి మండలం, గోపాలపురం మండలం జగన్నాథపురంలో దొండపాదులు నేలకొరిగాయి. చాగల్లు మండలంలో పేములకాలువ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో చాగల్లు-కొవ్వూరు మధ్య  రాకపోకలను అధికారులు నిలిపివేశారు. భీమవరం మండలం నాగిడిపాలెం-దెయ్యాలతిప్ప నడుమ బందచేడు డ్రెయిన్ సమీప పొలాలను ముంచెత్తింది. వర్షాల కారణంగా ఎర్రకాలువ విస్తరణ పనులు నిలిచిపోయాయి. తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లిలోని కడియపుచెర్వు ముం పువల్ల 200కు పైగా ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. కొయ్యలగూడెం మండలంలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు పొంగిపొర్లుతున్నాయి. సరిపల్లిలో ఇళ్లు నీట మునగడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గౌరీపట్నం, కొవ్వూరు, దొమ్మేరులో పంటలు నీటముని గాయి. ఆకివీడులో వెంకయ్య వయ్యేరు కాలువకు రెండుచోట్ల పడిన గండ్లను పూడ్చే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. దాని ఆయకట్టు పరిధిలోని 6వేల ఎకరాల్లో పంటలు ఇంకా ముంపులోనే ఉన్నారుు.
 
 అప్రమత్తమైన ప్రభుత్వ శాఖలు
 ముంపు తొలగకపోవడంతో వ్యవసాయ, నీటి పారుదల, పంచాయతీరాజ్, రెవెన్యూ, విద్యుత్ శాఖలు అప్రమత్తమయ్యూరుు. రెండు రోజులపాటు కురిసిన వర్షాలకు దాదాపు 2వేల ఎకరాల్లో పంటలు పూర్తిగా నీటమునిగాయని వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు వి.సత్యనారాయణ తెలిపారు. జిల్లాలోని ముంపు ప్రాంతాలను మంగళవారం ఆయన పరిశీలించారు. వర్షం ప్రభావం పంటలపై ప్రస్తుతానికి పెద్దగా లేదని, రెండు రోజుల్లో నీరు లాగేస్తే నష్టం వాటిల్లదని జేడీ వివరించారు. విద్యుత్ శాఖకు పెద్దగా నష్టం ఏమీ లేదని, విద్యుత్ సరఫరాకు ఎటువంటి ఆటంకాలు లేవని ఈపీడీసీఎల్  ఏలూరు ఆపరేషన్ సర్కిల్ ఎస్‌ఈ టీవీ సూర్యప్రకాష్ వెల్లడించారు.
 

మరిన్ని వార్తలు