నేడు అల్పపీడనం

30 Jun, 2019 04:15 IST|Sakshi

రెండు రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం 

కోస్తాంధ్రకు మూడు రోజులు వర్షాలు

సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ బెంగాల్‌ తీరానికి ఆనుకుని ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్రమట్టానికి 3.1 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించి నైరుతి వైపునకు వంగి ఉంది. దీని ప్రభావంతో ఆదివారం ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అనంతరం 48 గంటల్లో వాయుగుండంగా బలపడనుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం రాత్రి విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.

ఫలితంగా రానున్న మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. సోమవారం కోస్తాంధ్రలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉండడం వల్ల రాష్ట్రంలో శనివారం చెప్పుకోదగిన వర్షాలు కురవలేదు. 

మరిన్ని వార్తలు