కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు

14 Sep, 2015 15:03 IST|Sakshi

విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో స్థిరంగా అల్పపీడనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న 48 గంటల్లో అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపింది.  అల్ప పీడనం ప్రాంతంలో 7.6 కి.మీ ఎత్తు వరకు బలమైన ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. అల్పపీడనం కారణంగా కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

గంటకు 45-50 కి.మీ వేగంతో దక్షిణ కోస్తాలో పశ్చిమ దిశగా బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండగా, ఉత్తరకోస్తాలో వాయువ్య దిశగా బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం సూచించింది.

మరిన్ని వార్తలు