రామాలయ బంగారు, వెండి ఆభరణాల అప్పగింత

26 Dec, 2013 02:53 IST|Sakshi

భద్రాచలం, న్యూస్‌లైన్ : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో బంగారు, వెండి ఆభరణాలకు సంబంధించిన లావాదేవీలను బుధవారం పరిశీలించారు. గతంలో దేవస్థానం ఈవోగా పనిచేసిన కె. రామచంద్రమోహన్ సింహాచలం ఆలయానికి బదిలీపై వెళ్లిన నేపథ్యంలో ఆభరణాలకు సబంధించిన వివరాల బాధ్యతలను అప్పగించలేదు. అయితే ముక్కోటి ఏకాదశికి ఈ ఆభరణాలు స్వామివారికి అలంకరించాల్సి ఉన్నందున ఈవో రఘునాథ్ బుధవారం అందుబాటులో లేకున్నా.. వీటికి సంబంధించిన వివరాలను ఆలయ ఏఈవో శ్రావ ణ్‌కుమార్, సూపరింటెండెంట్ కనకదుర్గలకు అప్పగించారు.
 
  ఆలయంలో ఉన్న బంగారు, వెండి ఆభరణాలను వాస్తవిక సంఖ్య ఆధారంగా సరిపోల్చి వాటిని ధ్రువీకరించుకున్నారు. బ్యాంకులో ఉన్న ఆభరణాలను గురువారం పరిశీలించి వాటి బాధ్యతలను కూడా అందజేస్తానని సింహాచలం ఈవో రామచంద్రమోహన్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. అనంతరం ఆయన ఆలయ ప్రాంగణంలోని అద్దాల మండపాన్ని తిలకించారు. అద్దాల మండపం మూసి ఉన్నప్పటికీ పనులు ఏ మేరకు ఉన్నాయో చూ సేందుకు మండపం తాళాలు తీయించారు. అద్ధాల మండపంలో స్వామి వారిని భక్తులంతా కనులారా చూసేలా అన్ని వేళల్లో తాళాలు తీసి ఉంచితే బాగుంటుందని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఆలయ ఏఈ రవీందర్ ఉన్నారు.
 

మరిన్ని వార్తలు