ఆమరణ దీక్ష యోచనలో రమణ దీక్షితులు!

22 May, 2018 09:51 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : టీటీడీలో పదవీ విరమణ పంచాయితీ ఢిల్లీకి చేరింది. పాలకమండలి పదవీ విరమణ నిర్ణయంపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. టీటీడీ పాలక మండలి నిర్ణయాలపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్న రమణ దీక్షితులు తన దూకుడు పెంచుతున్నట్లు తెలుస్తోంది. టీటీడీ వైఖరికి నిరసనగా ఆయన ఆమరణ దీక్షకు దిగే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఆభరణాల మాయం, కైంకర్యాలలో లోపంపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలంటూ రమణ దీక్షితులు మంగళవారం సాయంత్రం బీజేపీ ఎంపీ సుబ్రహ‍్మణ్య స్వామిని కలిసే అవకాశం ఉంది. కాగా 65 ఏళ్లు దాటిన అర్చకులను విధుల నుంచి తొలగించి ఉద్యోగ విరమణ వర్తింపజేయాలని టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఉద్యోగ విరమణ వర్తింపు నిర్ణయం వంశపారంపర్య అర్చకుల్లో తీవ్ర అలజడి రేపుతోంది. మిరాశీ, నాన్‌ మిరాశీ కుటుంబాలుగా చెప్పుకునే అర్చకులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.

టీటీడీ పరిణామాలపై సీఎం సమీక్ష
మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో జరుతుఉన్న పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షకు పాలకమండలి చైర్మన్‌తో పాటు, టీటీడీ ఉన్నతాధికారులు హాజరు కానున్నారు.

మరిన్ని వార్తలు