దక్షిణ సమన్వయకర్తగా డా.రమణమూర్తి

17 Sep, 2018 06:51 IST|Sakshi
విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఎంపీ విజయసాయిరెడ్డి, పార్టీ నగరఅధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, కోలా గురువులు, డాక్టర్‌ రమణమూర్తి

పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా కోలా గురువులు, బొడ్డేడ ప్రసాద్‌

రాష్ట్ర అధికార ప్రతినిధిగా జాన్‌ వెస్లీ నియామకం

విశాఖపట్నం : ప్రజాసంకల్పయాత్ర నుంచి ప్రత్యేక బృందం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విశాఖ దక్షిణ నియోజవర్గ సమన్వయకర్తగా ప్రముఖ వైద్యుడు, కళ హాస్పటల్‌ అధినే త డాక్టర్‌ రమణమూర్తిని నియమిస్తూ ఆదివారం పార్టీ కేంద్ర కమిటీ ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గం సమన్వయకర్తగా ఉన్న కోలా గురువులును పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఇదే నియోజకవర్గానికి చెందిన సీనియర్‌ నాయకుడు జాన్‌ వెస్లీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతిని ధిగా నియమితులయ్యారు. వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్య సభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి ఆది వారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. కోలా గురువులు పార్టీ ఆవిర్భావం నుం చి అందిస్తున్న సేవలు మరువలేనివన్నారు.

పార్టీ అధికారంలోకి వ చ్చిన వెంటనే గు రువులుకు సముచిత స్థానం కల్పిస్తానని పార్టీ అధినేత జగన్‌మోహనరెడ్డి చెప్పారని విజయసాయిరెడ్డి తెలిపా రు. 2014లో విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి గురువులు పోటీ చేశారని, దురదృష్టవశాత్తు ఆయనను గెలిపించుకోలేకపోయామన్నారు. అయినప్పటికీ పార్టీ బలోపేతానికి గురువులు ఎప్పుడూ కృషి చేస్తూనే ఉన్నారని, వ్యక్తిగత కారణాల వల్ల తిరిగి పోటీ చేయనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారని, పార్టీ బలోపేతానికి కష్టపడి పనిచేస్తానని, జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే తన కర్తవ్యమని గురువులు చెప్పారన్నారు. ఈ పరిస్థితుల్లో గురువులు స్థానంలో దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్తగా డాక్టర్‌ రమణమూర్తిని నియమించాలని పార్టీ అధ్యక్షు డు నిర్ణయం తీసుకున్నారని, దీనికి సంబం ధించిన ప్రకటన కూడా వెలువడుతుందని విజయసాయిరెడ్డి చెప్పారు.  

3 వేల కిలోమీటర్ల మైలురాయి దిశగా..
ప్రజాసంకల్పపాదయాత్ర  మూడు వేల కిలోమీటర్ల మైలు రాయి దాటేందుకు ఉత్సాహంగా సాగుతోందని వైఎస్సార్‌సీపీ  నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్‌ అన్నారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జననేత జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు అడుగడుగునా ఘన స్వాగతం పలుకుతూ తమ కష్టాలు చెబుతూ తమ కన్నీళ్లు తుడిచే నాయకుడు వచ్చాడన్న ఆనందంతో ఉన్నారన్నారు.

జగన్‌మోహన్‌రెడ్డిని సీఎంచేయడమే లక్ష్యం: గురువులు
పాదయాత్ర జిల్లాలో ఎంతో విజయవంతమెం దని, ప్రజలందరి ఆదరాభిమానాలతో ముం దుకు సాగుతుందని కోలా గురువులు చెప్పారు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలని, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు మంచి పరిపాలన అందుకోవా లని కోరుకుంటున్నారని చెప్పారు. పార్టీ అధినేత నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని గురువులు చెప్పారు. ఆయనను సీఎం చేసే వరకు తన పోరాటం ఆగదని గురువులు తెలిపారు.

సమన్వయకర్తగా నియమించడం అదృష్టం: డాక్టర్‌ రమణమూర్తి
ప్రజాసంకల్పయాత్ర ఎంతో ఉత్సాహం గా సాగుతున్న తరుణంలో తనను దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడం అదృష్టంగా భావిస్తున్నానని నూతన సమన్వయకర్త డాక్టర్‌ రమణమూర్తి తెలిపారు. పార్టీ కార్యకర్తలందరినీ కలుపుకొని పార్టీ అభివృద్దికి కృషి చేస్తానన్నారు. జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని రమణమూర్తి తెలిపారు. విశాఖ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు తైనాల విజయకుమార్, అనకాపల్లి పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు