ఫ్యాక్టరీ వల్లే దుర్వాసన

21 Jan, 2014 02:07 IST|Sakshi

కర్నూలు(సిటీ), న్యూస్‌లైన్:  ఆల్కాలీస్ ఫ్యాక్టరీ నుండి వచ్చే వ్యర్థాల వల్లే తుంగభద్ర నదీ తీరం వె ంట ఉన్న కాలనీల్లో దుర్వాసన వస్తోందని మానవహక్కుల వేదిక అధ్యక్షుడు శ్రీనివాసులు అన్నారు. మూ డు వారాలుగా సమస్య తీవ్రం కావడంతో సోమవారం వేదిక నాయకులు జమ్మిచెట్టు, సుబ్రహ్మణ్యం మఠం, చిత్తారి వీధి, ఖండేరి ప్రాంతాల్లో పర్యటించారు. నదిలో గుంతలు పడ్డ పలుచోట్ల దుర్వాసనను పరిశీలించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలో మూడు వారాలుగా దుర్వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

 ప్రజాసంఘాలు ఆందోళన కార్యక్రమాలు, ధర్నాలు చే స్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. గుంతల్లో పాచీ పేరుకుపోయి దుర్వాసన వస్తోందని చెబుతున్నా దాంట్లో వాస్తవం లేదన్నారు. ఆల్కాలీస్ ఫ్యాక్టరీ నుంచి వెలువడే కె మికల్ వ్యర్థ పదార్థాల వల్లే ఈ సమస్య వచ్చిందన్నారు. తుంగభద్రలో నీటి ప్రవాహం లేక భరించలేని దుర్వాసన వస్తోందన్నారు.

వేదిక ఆధ్వర్యంలో కాలుష్య నియంత్రణ మండలి, ఆల్కాలీస్ ఫ్యాక్టరీ యజమానులను కలసి సమస్యను వివరిస్తామన్నారు. అధికార యంత్రాంగం ఇప్పటికైనా స్పందించి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల న్నారు. కార్యక్రమంలో మానవ హక్కు ల వేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీ, సోష ల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు అబ్దుల్ వారిస్, దేవేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు