బయటపడ్డ రంగనాయకమ్మ కేసుల చిట్టా

5 Jun, 2020 19:16 IST|Sakshi

సాక్షి, గుంటూరు : విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన గుంటూరుకు చెందిన రంగనాయకమ్మ కేసుల చిట్టాలను పోలీసులు బయటపెట్టారు. ఆమెపై ఇదివరకు పలు కేసులు నమోదై ఉన్నట్లు పోలీస్‌ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. రంగనాయకమ్మపై 2011 నుంచి పలు క్రిమినల్, సివిల్ కేసులు ఉన్నట్లు జిల్లా పోలీసులు గుర్తించారు. 2011లో ఓ కేసులో ఆమెకు గుంటూరు కోర్డు 5వేల రూపాయల జరిమానా విధించింది. అలాగే  2014లో ఆమెపై నమోదైన ఓ సివిల్ కేసు విచారణ సందర్భంగా రూ.15.40 లక్షలు చెల్లించాల్సిందిగా కోర్టు ఆదేశించిట్లు రికార్డులో తేలింది. (రంగనాయకమ్మా.. డ్రామాలెందుకమ్మా!)

ఇక వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న రంగనాయకమ్మ 2014, 2015ల్లో నమోదైన 3 క్రిమినల్ కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం గుంటూరు, మార్కాపురం కోర్టుల్లో 4 క్రిమినల్ కేసుల్లో విచారణ జరుగుతోంది. అవికాక తాజాగా ప్రభుత్వంపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టుల కేసులోనూ రంగనాయకమ్మ విచారణ ఎదుర్కొంటున్నారు. ఇకపోతే ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన రంగనాయకమ్మ వ్యవహారశైలిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆమె చేసిన గత పోస్టులన్నింటినీ గమనిస్తే కావాలనే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు చేస్తున్నట్లు అర్థమవుతోందని వారందరూ అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు