మెడిసిన్‌లో మెరికలు

11 Jun, 2014 02:29 IST|Sakshi
మెడిసిన్‌లో మెరికలు

వారు లక్ష్యం పెట్టుకున్నారు. ఇందుకు రాత్రి పగలు కష్టపడి చదివారు.అనుకున్నది సాధించారు.ఎంసెట్ (మెడిసిన్‌విభాగం)లో ప్రతిభ చాటి ఉత్తమ ర్యాంకులు తెచ్చుకొని కలలను సాకారం చేసుకోబోతున్న జిల్లాకు చెందిన పేద, మధ్యతర గతి విద్యార్థులు.
 
నంద్యాలరూరల్..
పట్టణంలోని డేనియల్ పురంకు చెందిన పి.సాయినాగరక్షిత్ ఎంసెట్ మెడిసిన్ విభాగంలో 154 మార్కులతో రాష్ట్రస్థాయి 64వ ర్యాంకు సాధించాడు. ఉపాధ్యాయులైన విజయశేఖర్, నాగకుమారిల మొదటి సంతానమైన సాయిరక్షిత్ 10వ తరగతి స్థానిక బాలాజీ కాంప్లెక్స్‌లోని కేశవరెడ్డి స్కూల్‌లో చదివాడు. విజయవాడలోని శ్రీచైతన్య నారాయణలో ఇంటర్ విద్యను పూర్తి చేశాడు. పదవ తరగతిలో పదికి పది జీపీఏ, ఇంటర్‌లో 967మార్కులు సాధించాడు. అదే విధంగా ఎంసెట్‌లో 154 మార్కులు సాధించి 64వ ర్యాంకు సాధించి నంద్యాలకు గర్వకారణంగా నిలిచాడు. డాక్టర్ కావాలనే పట్టుదలతో చదివానని సాయినాగ రక్షిత్ తెలిపాడు.ఈ విద్యార్థికి పలువురు పట్టణ ప్రముఖులు మంగళవారం అభినందించారు.
 
కర్నూలు(విద్య)..
మాది కోడుమూరు. నాన్న వి. శ్రీనివాసులు ఓ ప్రైవేటు సంస్థలో వాటర్‌ట్యాంక్స్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు. అమ్మ రాజేశ్వరి గృహిణి. నాకు అక్క, తమ్ముడు ఉన్నారు. నేను పదవ తరగతిలో 560 మార్కులు, ఇంటర్‌లో 976 మార్కులు తెచ్చుకున్నాను. మొదటి ప్రయత్నంలో ఎంసెట్‌లో 6,500 ర్యాంకు రావడంతో లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకున్నాను. ఇప్పుడు 142 మార్కులతో 455వ ర్యాంకు సాధించడం ఆనందంగా ఉంది. మెడిసిన్ పూర్తి చేసి న్యూరాలజిస్టు కావాలన్నదే నా లక్ష్యం.
 
వెలుగోడు..
మండలానికి చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంసెట్ ఫలితాల్లో సత్తాచాటారు. ఇందులో వెలుగోడు పట్టణానికి చెందిన జె.సుంకన్న, జె.లుథియా దంపతుల కుమారుడు జె. సుమియోన్ మెడిసిన్‌లో 757 ర్యాంకు సాధించాడు. ఈ విద్యార్థి 1 నుంచి 5వ తరగతి వరకు వెలుగోడు పట్టణంలోని లిటిల్ పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు నవోదయ పాఠశాలలో విద్యను అభ్యసించాడు. ఇంటర్మీడియట్ హైదరాబాద్‌లోని శ్రీగాయిత్రి కళాశాలలో చదివి 962 మార్కులు తెచ్చుకున్నాడు.
 
మొదటి ప్రయత్నంలోనే ఎంసెట్‌లో  757ర్యాంకు సాధించడంతో విద్యార్థి తల్లిదండ్రులు, బంధుమిత్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సుమియోన్ తండ్రి  బోయరేవుల గ్రామ కార్యదర్శిగా పని చేస్తున్నాడు.  అలాగే అబ్దుల్లాపురం గ్రామానికి చెందిన వంగాల వెంకటకృష్ణారెడ్డి, నాగేశ్వరమ్మ దంపతుల కుమారుడు వంగాల సతీష్‌కుమార్‌రెడ్డి ఎంసెట్‌లో 1491ర్యాంకు సాధించాడు. ఈ విద్యార్థి 1 నుంచి 10వ తరగతి వరకు నంద్యాలలో శ్రీలక్ష్మి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చదివాడు. ఇంటర్మీడియట్ విజయవాడ చైతన్య కళాశాలలో చదివి 960 మార్కులు సాధించాడు. తర్వాత ఎంసెట్ రాసి మెడిసిన్‌లో మంచి ర్యాంకు తెచ్చుకున్న ఈ విద్యార్థి పేద ప్రజలకు వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.   
 
మెడికల్‌లో డెరైక్టర్స్ అకాడమీ విజయకేతనం
కర్నూలు(విద్య): ఎంసెట్-2014 ఫలితాల్లో కర్నూలులోని డెరైక్టర్స్ అకాడమీ విజయకేతనం ఎగురవేసినట్లు సంస్థ డెరైక్టర్లు చంద్రశేఖర్, భోగేంద్రనాథ్‌రెడ్డి చెప్పారు. మంగళవారం స్థానిక కొత్తబస్టాండ్ వద్ద ఉన్న డెరైక్టర్స్ అకాడమీలో మెడికల్ సీట్లకు ఎంపికైన విద్యార్థులను వారు అభినందించారు. ప్రారంభించిన మొదటి బ్యాచ్‌లో మొత్తం 68 మంది విద్యార్థుల్లో 12 మంది మెడికల్ సీట్లు సాధించారని  తెలిపారు. సురేఖ అనే విద్యార్థిని 142 మార్కులతో 455 ర్యాంకు తెచ్చుకుందని చెప్పారు. అలాగే కీర్తి 1110, ఉషశ్రీ 1134, జె. సుమన్ 1916, రామ్‌రాజేష్ 2618, పాల్‌గిడియాన్ 2920, ఎ. దివ్య 4215, బీకే మల్లీశ్వరి 5782, కె. సునీత 6638, సాయిశిరీష 5469, శ్రీలత 11,179 ర్యాంకులు సాధించినట్లు వివరించారు.

మరిన్ని వార్తలు