అత్యాచారం కేసులో నిందితుడి అరెస్ట్

16 Mar, 2016 03:09 IST|Sakshi

- ఎస్పీ విశాల్ గున్నీ
కోవూరు : ఎనిమిదేళ్ల గిరిజన బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు. మంగళవారం సాయంత్రం కోవూరు పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. కొడవలూరు మండలం గండవరంలో ఇటీవల పెద్దకాలువ కట్టవద్ద గిరిజన బాలికకు మాయమాటలు చెప్పి వలసకూలీ అయిన కత్తి శ్రీను గండవరం తిరునాళ్లకు తీసుకువెళ్లాడన్నారు. బాలికకు భోజనం పెట్టించి మాజా కూల్‌డ్రింక్స్ తీసిస్తాని నిర్మానుష ప్రదేశాన్ని తీసుకువెళ్లి విచక్షణారహితంగా అత్యాచారం చేశాడన్నారు. రూరల్  డీఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి పర్యవేక్షణలో దర్యాప్తు వేగవంతం చేసి కోవూరులో నిందితుడిని మంగళవారం అరెస్ట్ చేశామన్నారు.

కత్తి శ్రీనుది జోన్నవాడ అని తెలిపారు. అక్కడ నుంచి వివిధ రకాల కూలి పనులు చేసుకుంటూ నెల్లూరు కాపువీధిలో ఉండేవాడన్నా రు. ఈ కేసు దర్యాప్తు చేసిన వారిలో సీఐ మాధవరావు, కొడవలూరు ఎస్ ఐ నారాయణరెడ్డి, ఐడీ పార్టీ సిబ్బం ది కృష్, విజయప్రసాద్ ఉన్నారు.
 
నేరాల నియంత్రణకు చర్యలు
విడవలూరు: జిల్లాలో నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ విశాల్‌గున్నీ తెలిపారు. విడవలూరులోని పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం రాత్రి తనిఖీ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ ముఖ్యంగా నేరాల నివారణకు చర్యలు తీసుకునే విధంగా తమ సిబ్బందికి సూచించామన్నారు. తీర ప్రాంతాల్లో పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎస్పీ వెంట నెల్లూరురూరల్ డీఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి, కోవూరు సీఐ మాధవరావు ఉన్నారు.

మరిన్ని వార్తలు