తెలుగు వైద్యుడికి అరుదైన గౌరవం

25 Mar, 2018 03:21 IST|Sakshi

ఇటలీకి చెందిన సంస్థకు డైరెక్టర్‌గా డా. వికాస్‌ నియామకం

సాక్షి, అమరావతి: హైదరాబాద్‌కు చెందిన దంత వైద్య నిపుణులు డా. వికాస్‌గౌడ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఇటలీలోని ‘యూనివర్సిటీ డెగ్లి స్టడీ ది జెనోవా’ తొలిసారిగా తమ సంస్థకు డైరెక్టర్‌గా నియమించింది. భారతీయ వైద్యుడిని డైరెక్టర్‌గా నియమించడం ఇదే తొలిసారి.

దంతవైద్యంలో ఇంప్లాంటాలజీలో అనుభవం గడించిన ఈయనను విద్యాబోధనకు గాను అక్కడ డైరెక్టర్‌ హోదా కల్పించినట్టు యూనివర్సిటీ తెలిపింది. దంత వైద్యంలో అత్యంత ఆధునిక ఇంప్లాంటాలజీలో కోర్సుల నిర్వహణ, విద్యాబోధనలో చురుకైన పాత్ర పోషించగలరని ఆశిస్తున్న ట్టు డా. వికాస్‌గౌడ్‌కు పంపిన లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ సమావేశాల్లో ద డెంటల్‌ ఇంప్లాంటాలజీపై పరిశోధనా పత్రాలు సమర్పించడమే కాకుండా, పలువురు విద్యార్థులకు ఆయన ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఇటలీకి చెందిన ఈ సంస్థ తనకు డైరెక్టర్‌ పదవి ఇవ్వడం ఆనందంగా ఉందని డా. వికాస్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు