సహకారానికి అరుదైన అవకాశం

30 Jun, 2020 11:17 IST|Sakshi

డీసీఎంఎస్‌ టు టీటీడీ 

ఒంగోలు నుంచి తిరుమలకు శనగపప్పు, కందిపప్పు  

సరఫరా ఆర్డర్‌ సొంతం చేసుకున్న సొసైటీ

టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి నుంచి అనుమతి 

తొలివిడతగా 50 టన్నుల సరఫరాకు నిర్ణయం 

నేరుగా రైతుల నుంచి పంట ఉత్పత్తుల కొనుగోలు  

నష్టాల నుంచి లాభాల బాటన డీసీఎంఎస్‌ 

ఒంగోలు సబర్బన్‌: ప్రకాశం జిల్లాకు చెందిన సహకార మార్కెటింగ్‌ సంఘం (డీసీఎంఎస్‌) అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకుంది. కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి సన్నిధానం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కు శనగపప్పు, కందిపప్పు సరఫరా ఆర్డర్‌ సొంతం చేసుకుంది. జిల్లా కేంద్రం ఒంగోలు నుంచి తొలివిడతలో భాగంగా రెండు రకాల పప్పులు కలిపి 50 టన్నులు సరఫరా చేయాలని టీటీడీ చైర్మన్, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రకాశం డిస్టిక్ట్‌‌ కో ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీకి అనుమతి ఇచ్చినట్లు సొసైటీ చైర్మన్‌ రావి రామనాథంబాబు పేర్కొన్నారు. సరఫరా చేసేందుకు పప్పు తయారీ కోసం కసరత్తు ప్రారంభించారు. డీసీఎంఎస్‌ చరిత్రలో ఇలాంటి వ్యాపార నిర్ణయం ఏ పాలక మండలి కూడా తీసుకోలేదు. రాష్ట్రంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2019 డిసెంబర్‌లో డీసీఎంఎస్‌ పాలకవర్గాన్ని ఏర్పాటు చేశారు. సొసైటీ చైర్మన్‌గా ఆ పార్టీ పర్చూరు ఇన్‌చార్జ్‌ రావి రామనాథంబాబు బాధ్యతలు చేపట్టారు. కొత్త పాలకవర్గం ఏర్పాటైన నాటి నుంచి సొసైటీని అభివృద్ధి పథంలో నడిపించాలన్నదే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. 

రైతుల నుంచి నేరుగా పంట ఉత్పత్తుల కొనుగోలు.... 
పంట ఉత్పత్తులను డీసీఎంఎస్‌ గతంలో ఎన్నడూ లేని విధంగా నేరుగా రైతుల నుంచే కొనుగోలు చేసింది. గత సంవత్సరం ఖరీఫ్, రబీ సీజన్లలో పండించిన ధాన్యం, కందులు, శనగలు కొనుగోలు చేసింది. 7,800 మెట్రిక్‌ టన్నులు ధాన్యం, 5 వేల మెట్రిక్‌ టన్నులు శనగలు, 400 మెట్రిక్‌ టన్నులు కందులు కొనుగోలు చేశారు.  ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం దళారీ వ్యవస్థను రూపుమాపి కొనుగోలు చేయటం ద్వారా అటు రైతుకు లాభం చేకూరడంతో పాటు ఇటు కొనుగోలు పర్సెంటేజ్‌ రూపంలో ప్రభుత్వం నుంచి సొసైటీకి కూడా ఆదాయం సమకూరినట్టయింది.   

సహకార రంగానికి ఊపిరి పోసిన వైఎస్సార్‌... 
డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో సహకార రంగానికి ఊపిరి పోశారు. సహకార వ్యవస్థను బలోపేతం చేయటంలో వైఎస్‌ కీలక పాత్ర పోసిస్తే ఆ తర్వాత దానిని నిరీ్వర్యం చేయటంలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధాన భూమిక పోషించారు. సహకార రంగాన్ని ప్రైవేటు పరం చేశారు. ఆయన హయాంలోనే చీరాల, ఇంకొల్లు స్పిన్నింగ్‌ మిల్లులను పైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేశారు. తన సొంత సంస్థ హెరిటేజ్‌ డెయిరీ కోసం సహకార రంగంలో ఉన్న డెయిరీలన్నింటినీ నిలువునా నాశనం చేశారు. చిత్తూరు, ఒంగోలు డెయిరీలే అందుకు స్పష్టమైన ఉదాహరణలు. ఒంగోలు డెయిరీ ఇప్పటికీ కోలుకోలేని స్థితిలోకి వెళ్లిపోయింది. ఇక వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తిరిగి సహకార రంగానికి జీవం పోస్తున్నారు. సహకార రంగం బలోపేతం అయితేనే గ్రామీణ ప్రాంతాలు కళకళలాడతాయన్నది ముఖ్యమంత్రి ఉద్దేశం. అందుకే వచీ్చరాగానే పీడీసీసీ బ్యాంకుకు నూతన పాలక మండలి, సొసైటీలకు పాలక మండళ్లు, పొగాకు ఉత్పత్తిదారుల సమాఖ్యకు, డీసీఎంఎస్‌కు కూడా వెంటనే పాలక మండళ్లు వేసి వాటికి జవసత్వాలు తీసుకొచ్చారు.  

సొసైటీని లాభాల బాట పట్టించే దిశగా... 
నష్టాల్లో ఉన్న డీసీఎంఎస్‌ను లాభాల బాట పట్టించటమే లక్ష్యంగా పాలకవర్గం ముందుకు సాగుతోంది. చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టే నాటికి డీసీఎంఎస్‌ రూ.61 లక్షలు అప్పుల్లో ఉంది. తొలుత రైతులకు మేలు చేసేవిధంగా వ్యాపార కార్యకలాపాలను నిర్వహించి తద్వారా వచ్చే ఆదాయంతో ఉన్న అప్పులు తీర్చటమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. ఉన్న అప్పులు తీర్చి వ్యాపార లావాదేవీలను ఎక్కువ చేసి తద్వారా లాభాలు ఆర్జించి సొసైటీని నిలదొక్కుకునేలా చేయటమే ధ్యేయంగా కృషి చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చే భక్తుల కోసం అవసరమైన శనగపప్పు, కందిపప్పు సరఫరా చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.  

సహకార రంగానికి స్వర్ణయుగం... 
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఏర్పాటయిన నాటి నుంచి సహకార రంగానికి స్వర్ణయుగమనే చెప్పాలి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వం సహకార రంగాన్ని ప్రోత్సహిస్తోంది. టీటీడీకి డీసీఎంఎస్‌ నుంచి శనగపప్పు, కందిపప్పు సరఫరా చేయాలని ఆదేశాలు రావటమే అందుకు ప్రధాన ఉదాహరణ. టీటీడీకి మంచి నాణ్యమైన శనగపప్పు, కందిపప్పు సరఫరా చేసి జిల్లా పేరు నిలబెడతాం. డీసీఎంఎస్‌కు సింగరాయకొండ, కనిగిరి, కంభం, ఒంగోలుల్లో స్థిరాస్తులు ఉన్నాయి. వాటిని కాపాడుతూనే, ఆ ఆస్తులను కూడా అభివృద్ధి పరుస్తాం. నాబార్డు ద్వారా రైతులకు గోడౌన్‌ సదుపాయాలు కలి్పంచాలని సంకలి్పంచాం. తద్వారా వ్యాపార కార్యకలాపాలను కూడా విస్తరించేందుకు జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సహకారంతో ముందుకు సాగుతాం. 
– రావి రామనాథం బాబు, చైర్మన్, డీసీఎంఎస్‌  

మరిన్ని వార్తలు