వైభవంగా రథసప్తమి వేడుకలు

1 Feb, 2020 08:13 IST|Sakshi

 నేడు రథసప్తమి సప్తమి

 వాహనాలపై మలయప్ప విహారం

ఉదయం 5.30 గంటలకు సేవల ప్రారంభం

అర్ధరాత్రి నుంచే పోటెత్తిన భక్తజనం  

తొలి అభిషేకం  చేసిన శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి 

క్షీరాభిషేక సేవలో రాష్ట్ర మంత్రులు వెలంపల్లి, ధర్మాన తదితరులు

తన కిరణాలతో లోకాలను తట్టిలేపే ప్రత్యక్ష దైవానికి పుట్టిన రోజు ఉత్సవం ఘనంగా మొదలైంది. శుక్రవారం అర్ధరాత్రి సప్తమి ఘడియల్లో కర్మసాక్షి అయిన శ్రీసూర్యనారాయణ స్వామి వారి మూలవిరాట్టుకు వేదమంత్రాల నడుమ అర్చక బృందం ఆధ్వర్యంలో పంచామృతాలతో అభిషేక స్నానాలు చేయించారు. ముల్లోకాలను వెలుగులతో నింపిన ఆదిత్యుడు నిశిరాత్రి వేళ తెల్లని పాలపొంగుల్లో దర్శనమిచ్చాడు. నల్లటి అరుణశిల కాస్తా.. శ్వేతవర్ణంలో మారిపోయి భక్తులకు కనువిందు చేశాడు. 

సాక్షి, అరసవల్లి: శ్రీకాకుళం అరసవిల్లి సూర్యదేవాలయం భక్తులు తో కిటకిటలాడుతోంది. దేశవ్యాప్తంగా వచ్చిన భక్తులు సూర్యజయంతి సందర్భంగా స్వామివారి నిజరూప దర్శనం చేసుకొని తరిస్తున్నారు. ఇంద్రపుష్కరణి వద్ద పాయసం వండి నైవేద్యాలు పెట్టి మొక్కుబడులు చెల్లిస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవాలయ అధికార్లు పోలీస్, రెవిన్యూ, ఫైర్ సిబ్బంది సహకారం తీసుకున్నారు. అరసవల్లి సూర్యక్షేత్రం వద్ద భక్తుల రద్దీ కొనసాగుతుంది.

సూర్యజయంతి (రథసప్తమి) సందర్భంగా ప్రసిద్ధ సూర్యక్షేత్రం అరసవల్లిలో శ్రీసూర్యనారాయణస్వామి వారి జయంత్యుత్సవం... ఒకరోజు బ్రహ్మోత్సవంగా బ్రహ్మండమైన రీతిలో జరిగింది. మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల మధ్య ఆలయ ప్రాంగణమంతా ఆదిత్యుని నామస్మరణతో మార్మోగింది. శుక్రవారం అర్ధరాత్రి 12.15 గంటలకు దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఆర్‌అండ్‌బి మంత్రి ధర్మాన కృష్ణదాస్, ఉత్సవ అధికారి ఎన్‌.సుజాత, జిల్లా సహాయ కమిషనర్‌ వై.భద్రాజీ, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఇప్పిలి జోగి సన్యాసిరావు, ఆలయ ఈవో వి.హరిసూర్యప్రకాష్‌ తదితరులు స్వామి వారికి సంప్రదాయం ప్రకారం పట్టువ్రస్తాలను సమర్పించారు.

అనంతరం స్థానిక అనివేటి మండపంలో ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వ ర్యంలో మహా సంకల్పం జరిగింది. అనంతరం 12.30 గంటలకు తొలి అభిషేకాన్ని విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వా త్మానందేంద్ర సరస్వతి స్వామిజీ చేతుల మీదుగా జరిపించారు. గర్భాలయంలోని ఆదిత్యుని మూలవిరాట్టుపై పంచామృతాలతో అభిషేకించారు. అనంతరం 12.45 గంటల నుంచి సర్వదర్శనాలకు అనుమతిచ్చారు. అభిషేక సేవ శనివారం ఉదయం 8 గంటల వరకు జరిగింది. అనంతరం స్వామి నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్పీకర్‌ తమ్మినేని సీతా రాం సతీసమేతంగా వచ్చి స్వామిని దర్శించుకున్నారు. అలాగే శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు, కలెక్టర్‌ జె.నివాస్‌ స్వామిని దర్శించుకున్నారు.

పోటెత్తిన భక్తజనం 
రథసప్తమిని పురస్కరించుకుని సుదూర ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు శుక్రవారం రాత్రి సరికే అరసవల్లి చేరుకున్నారు. ఆలయ పరిసరాల్లో, ప్రధాన రోడ్డుపైన భక్తుల కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లలో భక్తులు వచ్చి స్వామి క్షీరాభిõÙకం, నిజరూపాన్ని దర్శించుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి 12.30 గంటలకు క్షీరాభిషేకం ప్రారంభమై.. శనివారం ఉదయం 8 గంటలకు ముగిసింది. తర్వాత నిజరూపంలో స్వామి దర్శనమిచ్చారు. వీవీఐపీలు, వీఐపీలు, జిల్లా ఉన్నతాధికారులు, దాతల కుటుంబాలతోపాటు క్షీరాభిõÙక దర్శనం (రూ.500), ప్రత్యేక దర్శనం (రూ.100) క్యూలైన్లవారికి కూడా ఆలయ సింహద్వా రం (ఆర్చిగేట్‌) నుంచి ప్రవేశం కలి్పంచారు. అర్ధరాత్రి నుంచి పోలీసులు పూర్తి స్థాయి భద్రతావ్యవస్థను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయడంతోపాటు జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డి నేరుగా పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఇదిలావుంటే స్థానిక డీసీఎంఎస్‌ గొడౌన్‌ నుంచి రూ.500, రూ.100 దర్శనాల క్యూలైన్లు ప్రారంభమయ్యాయి. అలాగే సా ధారణ దర్శనాల మార్గం కూడా ఇలాగే ప్రారంభమయ్యింది. అయితే ఈ లైన్‌ అసిరితల్లి అమ్మవారి ఆలయం పక్క నుంచి సాగింది. వాస్తవానికి శుక్రవారం రాత్రి నాటికే ఆలయ పరిసరాలకు చేరుకున్న గ్రామీణ ప్రాంత భక్తులు క్యూలైన్లలోనే ఉండి పోయారు. తొలి దర్శనాలకు వీలు కోసం అక్కడే అర్ధరాత్రి వరకు కాలం గడిపారు. 

కట్టుదిట్టమైన ఏర్పాట్లు 
ఈసారి సామాన్యుల దర్శనాలకు ప్రాధాన్యమిస్తూ జిల్లా కలెక్ట ర్‌ జె.నివాస్, ఎస్పీ అమ్మిరెడ్డి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయించా రు. దేవదాయ, రెవెన్యూ, పోలీస్‌ శాఖల సంయుక్త పర్యవేక్షణ లో వీఐపీల దర్శనాలకు మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ ప్రకా రం శుక్రవారం అర్ధరాత్రి నుంచి భారీ పోలీసుల వలయంగా సింహద్వారం కని్పంచింది. దాతల కుటుంబసభ్యుల వాహనాలను అటు 80 ఫీట్‌ రోడ్డులోనే (అనుమతి పాస్‌ లేనివి) నిలిపివేయడంతో సుమారు కిలోమీటరు దూరం నుంచి నడిచి రావలసివచ్చింది. అలాగే సాధారణ దర్శనాలకు వెళ్లే వారు కూడా ఎక్కువ దూరమే నడిచేలాఏర్పాట్లున్నాయని జిల్లాకలెక్టర్‌ నివా స్‌ ఆదేశాల మేరకు ఆల య మండపాల్లో జిగ్‌జాగ్‌ లైన్లు కాకుండా నేరుగా ఒకే లైన్లో దర్శనాలకు అనుమతిచ్చారు.  

మినీ బ్రహ్మోత్సవం.. చూతము రారండి
తిరుమల : వేంకటాదివాసుడు  ఏడాది పొడవు నా 450కి పైగా ఉత్సవాలు, సేవల్లో పూజలందుకుంటూ భక్తులను కటాక్షిస్తున్నారు. శ్రీవారి ఆలయంలో ఆయా మాసాల్లో నిరి్ధష్టంగా ఆచరిస్తున్న సేవలు, ఉత్సవాలూ నిర్విఘ్నంగా కొ నసాగుతున్నాయి. అర్ధంతరంగా ఆగిపోయిన కొన్ని సేవల్ని పునరుద్ధరించడం, మరికొన్నింటిని మార్పులు, చేర్పులు చేసి, టీటీడీ తిరుమలేశుని వైభవ ప్రాశస్త్యాన్ని విశ్వవ్యాప్తంగా చాటుతోంది. వైఖానస ఆగమోక్తంగా నిర్వహించే ఒక్కొక్క ఉత్సవంలో దివ్యతేజోమూర్తి వైభవం ఒక్కోలా గోచరిస్తుంది. ప్రతి ఉత్సవంలోనూ స్వామివారు నిత్యనూతనంగా భక్తకోటికి దర్శనమిస్తూ కటాక్షిస్తూ భక్తుల మది నిండా భక్తిపారవశ్యాన్ని నింపుతారు. విశేషమైన సేవలు, ఉత్సవాల్లో వేంకటేశుని దర్శిస్తూ భక్తులు  దివ్యమైన అనుభూతిని పొందుతారు. ఇందులో రథసప్తమి కూడా అతిముఖ్యమైన ఉత్సవంగా చెప్పవచ్చు. దీన్నే మినీ బ్రహ్మోత్సవంగా పిలుస్తారు. శనివారం ఉదయం 5.30 గంటలకు వాహన సేవలు ప్రారంభమై రాత్రి 9 వరకు సేవలు జరుగుతాయి. ఏడువాహనాలపై మలయప్పస్వామి మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయమివ్వనున్నారు. ఈ ఉత్సవానికి టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది.  

మరిన్ని వార్తలు