ఉన్నది పోయే.. కొత్తది రాదాయె.. రేషన్‌కార్డుల కోసం ఎదురుచూపు

23 Feb, 2019 13:06 IST|Sakshi
జన్మభూమి సభలో రేషన్‌ కార్డులకోసం అర్జీలు అందచేస్తున్న ప్రజలు

కుటుంబ విభజన కార్డులు ఊసెత్తని ప్రభుత్వం

జిల్లా వ్యాప్తంగా 22 వేల మంది రేషన్‌కార్డుల కోసం ఎదురుచూపు

కొత్త రేషన్‌కార్డుల కోసం 1100 సర్వీస్‌ నెంబర్‌కు ఫోన్‌ చేయమని ఉచిత సలహా

మీ–సేవా కేంద్రాల్లో ఓపెన్‌ కాని సర్వర్లు

రేషన్‌ కార్డులులేక సంక్షేమ పధకాలను కోల్పోతున్నామని ఆవేదన

యర్రగొండపాలెం, యర్రగొండపాలెం టౌన్‌: ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు జన్మభూమి కార్యక్రమం అట్టహాసంగా నిర్వహిస్తున్నప్పటికీ సమస్యలపై  గ్రామసభల్లో ఇచ్చిన అర్జీలకు పరిష్కారానికి నోచుకోకపోవడంతో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అనేక మంది కోల్పోతున్నారు. ప్రతినెలా రేషన్‌కార్డుల ద్వారా చౌకధరల దుకాణాల్లో రాయితీపై అందించే బియ్యం, కందిపప్పు, పంచదార వంటి సరుకులను కోల్పోతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మొత్తం తెల్ల రేషన్‌ కార్డులు 9,41,285 ఉండగా అందులో దాదాపు 22 వేల కుటుంబాలు కొత్త రేషన్‌ కార్డులు అందక ఇబ్బందులు పడుతున్నాయి. కొత్తగా వివాహాలు చేసుకున్నవారు. కొత్త రేషన్‌కార్డు కావాలంటే ముందుగా పేరెంట్స్‌ కార్డుల నుంచి పేర్లు తొలగించుకోవాలని అధికారులు ఇచ్చిన  సూచనల మేరకు అనేక మంది ఆ కార్డుల నుంచి తమ పేర్లు తొలగించుకున్నారు. తమ పేర్లు రేషన్‌ కార్డుల నుంచి తొలగించుకొని కొత్తకార్డుల కోసం అర్జీలు దాఖలుచేసి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు రెండు, మూడు సంవత్సరాలనుంచి కార్డుల కోసం ఎదురు చేస్తున్నామని వారు తెలిపారు.

ఒక్క గ్రామంలోనే 17మంది పేర్లుతొలగించుకున్నారు
2017 లో జరిగిన జన్మభూమి గ్రామసభలో యర్రగొండపాలెం మండలంలోని పాతగోళ్లవిడిపి గ్రామంలో 17 మంది  పేరెంట్స్‌ కారŠుడ్స నుంచి పేర్లు తొలగించుకుని, కొత్త రేషన్‌కార్డుల కోసం ధరఖాస్తులు చేశారు. ఏడాదిగా ఎదురుచూస్తున్న వీరికి 6వ విడత జన్మభూమి కార్యక్రమంలోనూ ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డులు పంపిణీ చేయలేదు. ఇదేమిటని అధికారులను ప్రశ్నిస్తే కాల్‌సెంటర్‌ 1100లకు ఫోన్‌ చేయమని బదులు ఇస్తున్నారని, ఉన్న కార్డులనుంచి పేర్లు తొలగించుకొని కొత్త కార్డులు మంజూరుకాక ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేయనిప్రభుత్వం
జిల్లాలో కొత్తకార్డుల కోసం గత సంవత్సరం జన్మభూమి, గ్రీవెన్‌సెల్, మీ కోసం వంటి కార్యక్రమాల్లో దాదాపు 37 వేల మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో గత సంవత్సరం జనవరిలో జరిగిన జన్మభూమి కార్యక్రమంతో పాటు, జూన్‌ నెలలో జరిగిన నవనిర్మాణ దీక్ష కార్యక్రమంలో ప్రభుత్వం 15 వేల మందికి కొత్త రేషన్‌కార్డులు పంపిణీ చేశారు. మిగతా 22 వేల మంది దరఖాస్తుల వివరాలను  వెబ్‌సైట్‌లో పెట్టారు. అధికారులతో విచారణ చేయించి, అర్హుల వివరాలను సేకరించి, అప్‌లోడ్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సీఎస్‌డీటీలు విచారణ పూర్తి చేసి, అర్హుల వివరాలను అప్‌లోడ్‌ చేసినప్పటికీ, ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డులు పంపిణీ చేయలేదు. రేషన్‌కార్డులకు దరఖాస్తు చేసినవారిలో కొందరు ప్రజాసాధికారిక సర్వేలో లేరని తేలింది. ఇంకా కొందరు వేరే కుటుంబంగా కాకుండా తల్లిదండ్రులతోనే కలిసి ఉన్నట్లు ప్రజాసాధికారిక సర్వేలో నమోదు కావడం వంటి కారణాలు చూపిస్తు  కొత్తకార్డులు మంజూరు చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తుంది.

రేషన్‌కార్డులేక ఇబ్బందులు
కొత్తకార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు పాత కార్డుల నుంచి వైదొలిగినవారు జిల్లాలో సుమారు 22 వేల మంది వరకు ఇబ్బంది పడుతున్నారు. పేరెంట్స్‌ కార్డుల్లో పేర్లు ఉండటం వలన కనీసం బియ్యం, కందిపప్పు వంటి సరుకులు వచ్చేవి. ఇంకా> విద్యా, వైద్యం, పక్కా గృహాలు తదితర అవసరాల కోసం రేషన్‌కార్డులులేక ఆ పథకాలను చేజార్జుకుంటున్నారు. వివిధ కారణాలు చూపి, ప్రభుత్వం కార్డులు మంజూరు చేయకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు.

రేషన్‌కార్డులేక ఇబ్బందులు
కొత్తకార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు పాత కార్డుల నుంచి వైదొలిగినవారు జిల్లాలో సుమారు 22 వేల మంది వరకు ఇబ్బంది పడుతున్నారు. పేరెంట్స్‌ కార్డుల్లో పేర్లు ఉండటం వలన కనీసం బియ్యం, కందిపప్పు వంటి సరుకులు వచ్చేవి. ఇంకా> విద్యా, వైద్యం, పక్కా గృహాలు తదితర అవసరాల కోసం రేషన్‌కార్డులులేక ఆ పథకాలను చేజార్జుకుంటున్నారు. వివిధ కారణాలు చూపి, ప్రభుత్వం కార్డులు మంజూరు చేయకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు.

ఉన్న రేషన్‌కార్డు తొలగించారు
తనకు ముగ్గురు కుమార్తెలకు, కుమారుడు వెంకటేశ్వరరెడ్డికి వివాహాలు అయ్యాయి. వెంకటేశ్వరరెడ్డి గతంలో రేషన్‌కార్డు కోసం పేరెంట్స్‌ కార్డు నుంచి పేరు తొలగించుకున్నాడు. తన కుమారుడికి కొత్త రేషన్‌కార్డు వచ్చింది. మాకున్న కార్డు తొలగించారు. తమ కార్డు ఎందుకు తొలగించారో అర్థంకావడంలేదు. గత 5 విడతలుగా గ్రామసభల్లో అర్జీలు ఇచ్చినప్పటికీ రేషన్‌కార్డు మంజూరు చేయడంలేదు. వృద్ధాప్యంలో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం. పింఛన్‌కు పెట్టుకోవాలంటే రేషన్‌కార్డు అడుగుతున్నారు.– వెన్నా పెద్ద యోగయ్య, వీరభద్రాపురం, వైపాలెం మండలం

మరిన్ని వార్తలు