రేపటి నుంచి డీలర్ల సమ్మె

15 Dec, 2018 13:41 IST|Sakshi

డీడీలు కట్టబోమని స్పష్టీకరణ

లైసెన్స్‌ రద్దు చేస్తామంటూ అధికారుల నోటీసులు

కర్నూలు(అగ్రికల్చర్‌): కమీషన్‌ వద్దని, గౌరవ వేతనం చెల్లించాలనే ప్రధాన డిమాండ్‌తో చౌకధరల దుకాణాల డీలర్లు ఈ నెల 16 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నారు. అయితే.. సమ్మెలోకి వెళితే లైసెన్స్‌ రద్దు చేస్తామన్న ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు భయపడేది లేదని, 16 నుంచి సమ్మెలోకి వెళ్లి తీరతామని డీలర్ల సంఘం నేతలు స్పష్టం చేస్తున్నారు. జనవరి కోటా సరుకుల పంపిణీకి డీడీలు కట్టే ప్రసక్తే లేదని, క్రిస్మస్‌ కానుకలు కూడా పంపిణీ చేయబోమని అంటున్నారు. మండల స్థాయిలోని గోదాములకు క్రిస్మస్‌ కానుకలు చేరినప్పటికీ ఇంతవరకు డీలర్లకు అందలేదు. వీటిని తీసుకోబోమని తెగేసి చెబుతున్నారు. సమ్మెలోకి వెళితే డీలర్ల లైసెన్స్‌లు రద్దు చేసి.. మహిళా సంఘాల ద్వారా క్రిస్మస్‌ కానుకలు పంపిణీ చేయించాలనే ఉద్దేశంతో పౌరసరఫరాల శాఖ అధికారులు ఉన్నారు. 

మరిన్ని వార్తలు