నేరుగా ఇంటికే రేషన్‌ సరుకులు

16 Apr, 2020 15:46 IST|Sakshi

గుడివాడలో ప్రయోగాత్మకంగా తెల్లకార్డు దారులకు రేషన్‌ సరుకులు హోం డెలివరీ

సాక్షి, గుడివాడ: తెల్లకార్డు దారులు రేషన్‌ డిపోలకు వెళ్లనవసరం లేదని.. గుడివాడ పట్టణంలో ప్రయోగాత్మకంగా వాలంటీర్ల ద్వారా నేరుగా ఇంటికే రెండో విడత ఉచిత రేషన్‌ సరుకులు అందిస్తున్నామని తహశీల్దార్ ఎం. శ్రీనివాసరావు తెలిపారు. పట్టణంలో ఉన్న 24 వేల తెల్ల కార్డుదారులకు 46 రేషన్‌ డిపోల ద్వారా పంపిణీ చేస్తున్నామని ఆయన వెల్లడించారు. తెల్ల కార్డు ఉన్న కుటుంబంలో మనిషికి 5 కేజీలు బియ్యం, 1 కేజీ శనగలు ఉచితంగా అందజేస్తున్నామన్నారు.

రేషన్‌షాపుకు ఒక్కో వాహనం చొప్పున ఏర్పాటు చేసి వాలంటీర్ల ద్వారా రేషన్‌ సరుకులు అందిస్తున్నామని తెలిపారు. గురువారం ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పంపిణీ చేస్తామన్నారు. కరోనా వైరస్‌ విజృభింస్తున్న నేపథ్యంలో కార్డుదారుల బయో మెట్రిక్‌ రద్దు చేసినట్లు తెలిపారు. రేషన్‌షాపు పరిధిలో ప్రభుత్వ ఉద్యోగి బయో మెట్రిక్‌ ద్వారా వాలంటీర్లు ఇంటికే రేషన్‌ సరుకులను అందజేస్తారని శ్రీనివాసరావు తెలిపారు.

మరిన్ని వార్తలు