వైఎస్‌ స్వర్ణయుగం జగన్‌తోనే సాధ్యం

15 Oct, 2018 12:02 IST|Sakshi

నియోజకవర్గ కో ఆర్డినేటర్లు

ఐదు నియోజకవర్గాల్లో రావాలి జగన్‌– కావాలి జగన్‌

కాకినాడ: వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలనా కాలంలోని స్వర్ణయుగం రావాలంటే ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ  కో ఆర్డినేటర్లు పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ, జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్న పథకాల ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తూ ఆదివారం ఐదు నియోజకవర్గాలలో  రావాలి జగన్‌– కావాలి జగన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఆయా నియోజకవర్గ కో ఆర్డినేటర్ల పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకొని వారికి నవరత్న పథకాల గురించి వివరించారు.   

ప్రత్తిపాడులో: ప్రత్తిపాడు కో ఆర్డినేటర్‌  పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ ఆధ్వర్యంలో రౌతులపూడి మండలంలోని ఐదు గిరిజన గ్రామాల్లో రావాలి జగన్‌–కావాలి జగన్‌ నిర్వహించారు. గిరిజనుల సమస్యలను పూర్ణచంద్రప్రసాద్‌ అడిగి తెలుసుకొన్నారు.

పి.గన్నవరంలో: నియోజకవర్గంలోని అంబాజీపేట మండలం తొండవరం, పి.గన్నవరం మండలం బెల్లంపూడి గ్రామాల్లో కో ఆర్డినేటర్‌ కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో రావాలి జగన్‌– కావాలి జగన్‌ కార్యక్రమాలు నిర్వహించారు.  పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి నవరత్న పథకాలను ప్రజలకు వివరించారు.

రాజానగరంలో : కో ఆర్డినేటర్‌ జక్కంపూడి విజయలక్ష్మి ఆ«ధ్వర్యంలో రాజానగరం మండలం సూర్యారావుపేటలో రావాలి జగన్‌–కావాలి జగన్‌లో భాగంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలతో మమేకమై వచ్చే ఎన్నికల్లో జగన్‌ నాయకత్వాన్ని బలపరచాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా పాల్గొన్నారు.

రంపచోడవరంలో: గంగవరం మండలం పిడతమామిడిలో కో ఆర్డినేటర్‌ నాగులాపల్లి ధనలక్ష్మి ఆధ్వర్యంలో రావాలి జగన్‌–కావాలి జగన్‌ నిర్వహించారు. జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్, నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్ళి పార్టీ విధానాలు ప్రచారం చేశారు.

రాజమహేంద్రవరం రూరల్‌లో : రాజమహేంద్రవరం రూరల్‌ 26వ డివిజన్‌లో ఆదివారం కో ఆర్డినేటర్‌ ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి నవరత్న పథకాలను ప్రచారం చేస్తూ జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు