ప్రజలకు భరోసానిస్తూ.. సమస్యలు ఆలకిస్తూ..

7 Oct, 2018 07:42 IST|Sakshi

కాకినాడ: కష్టాల్లో ఉన్న ప్రజలకు వైఎస్సార్‌ సీపీ అండగా ఉంటుందని భరోసా ఇస్తూ... ప్రజా సమస్యలను ఆలకిస్తూ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో శనివారం ‘రావాలి జగన్‌– కావాలి జగన్‌’కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గాల కో– ఆర్డినేటర్ల ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను వారికి వివరిస్తూ నవరత్న పథకాలను వివరించారు.

రాజమహేంద్రవరం సిటీలో...
రాజమహేంద్రవరం 39వ డివిజన్‌ కృష్ణానగర్‌లో కో–ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు రావాలి జగన్‌ – కావాలి జగన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటా తిరిగి ప్రజల కష్టాలను స్వయంగా గుర్తించి అన్నివర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ రూపొందించిన నవరత్న పథకాలు పేదలు జీవితాల్లో వెలుగులు నింపుతాయన్నారు. 

కాకినాడ సిటీలో.. 
కాకినాడ 25వ డివిజన్‌లో సిటీ కో ఆర్డినేటర్‌ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఇంటింటికీ వెళ్లి రావాలి జగన్‌– కావాలి జగన్‌ కార్యక్రమం నిర్వహించారు. విషజ్వరాలు, డెంగీ జ్వరాలతో ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే ప్రభుత్వం మొద్దు నిద్రలో జోగుతోందన్నారు.

రామచంద్రపురంలో..
కె.గంగవరం మండలం పాణింగపల్లిలో కో–ఆర్డినేటర్‌ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ రావాలి జగన్‌–కావాలి జగన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ప్రజలను దగా చేసిన చంద్రబాబు సర్కారుకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపు ఇచ్చారు. 

పి.గన్నవరంలో...
పి.గన్నవరం నియోజకవర్గంలోని పి.గన్నవరం, మామిడికుదురు, అప్పనపల్లి గ్రామాల్లో కో–ఆర్డి నేటర్‌ కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో రావాలి జగన్‌–కావాలి జగన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ రూపొందించిన నవరత్న పథకాలను ప్రజలకు వివరించారు.

పెద్దాపురంలో..
పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట పట్టణం 23వ డివిజన్‌లో కో–ఆర్డినేటర్‌ తోట సుబ్బారావునాయుడు రావాలి జగన్‌–కావాలి జగన్‌ నిర్వహించారు. జననేతకు ఒక్క అవకాశం ఇవ్వాలని వైఎస్‌ స్వర్ణయుగం ఆయనతోనే సాధ్యమంటూ ఇంటింటా ప్రచారం చేశారు.

రాజమహేంద్రవరం రూరల్‌...
రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గం కడియపులంకలో కో–ఆర్డినేటర్‌ ఆకుల వీర్రాజు రావాలి జగన్‌–కావాలి జగన్‌ నిర్వహించారు. టీడీపీ వైఫల్యాలను వివరిస్తూ కష్టాల్లో ఉన్న ప్రజలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇస్తూ ప్రచారం చేశారు. 

జగ్గంపేటలో...
జగ్గంపేట మండలం కృష్ణాపురంలో కో–ఆర్డినేటర్‌ జ్యోతుల చంటిబాబు రావాలి జగన్‌–కావాలి జగన్‌ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి టీడీపీ విధానాలు ఎండగట్టారు. జననేతతోనే రాష్ట్రానికి మంచిరోజులు వస్తాయన్నారు.

ప్రత్తిపాడులో..
ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం జి.కొత్తపాలెంలో కో–ఆర్డినేటర్‌ పర్వత పూర్ణ చంద్రప్రసాద్‌ రావాలి జగన్‌–కావాలి జగన్‌ నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నవరత్నాల పథకాల వల్ల కలిగే మేలును వారికి వివరించారు.

మరిన్ని వార్తలు