రావాలి జగన్‌.. కావాలి జగన్‌కు శ్రీకారం

17 Sep, 2018 13:54 IST|Sakshi
భీమవరంలో సమన్వయకర్తల సమావేశంలో మాట్లాడుతున్న వైవీ సుబ్బారెడ్డి, పాల్గొన్న కన్వీనర్లు

వైఎస్సార్‌ సీపీ జిల్లా పరిశీలకుడు,మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి

పశ్చిమగోదావరి, భీమవరం: తెలుగుదేశం పార్టీ అవినీతి, అక్రమాలను ప్రజలకు వివరించడానికి సోమవారం నుం చి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా ‘రావాలి జగన్‌–కావాలి జగన్‌’ కార్యక్రమాన్ని పెద్దెత్తున చేపట్టాలని ఆపార్టీ జిల్లా పరిశీలకుడు, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. భీమవరంలో మాజీ ఎమ్మెల్యే, పార్టీ నియోకవర్గ కన్వీనర్‌ గ్రంధి శ్రీనివాస్‌ నివాసం వద్దగల పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన నరసాపురం పార్లమెంట్‌ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల కన్వీనర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు నెలల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో వైఎ స్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాలను ప్రజల్లోనికి విస్తృతంగా తీసుకువెళ్లాలన్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రజలకిచ్చిన హామీలను తుంగలోతొక్కి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని, ప్రజల సమస్యలను తె లుసుకుని వాటి పరిష్కారానికి పోరాటం చేయడానికి ‘రావాలి జగన్‌–కావాలి జగన్‌’ పేరుతో ప్రతి గ్రామంలో పార్టీ నియోజకవర్గ కన్వీనర్, ఇతర నాయకులు పర్యటించాలని అన్నారు. 

టీడీపీ దోపిడీని ఎండగట్టాలి
తెలుగుదేశం పార్టీ నాలుగున్నరేళ్ల పాలనలో ఆపార్టీ నాయకులు దోపిడీ, అవినీతిని పూర్తిగా ప్ర జలకు వివరించాలని సుబ్బారెడ్డి సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు నెలకు రూ.2 వేలు నిరుద్యోగభృతి ఇస్తామని ఇచ్చిన హామీని, ఎన్నికలు సమీపిస్తుండటంతో రూ.1,000 ఇచ్చి చేతులు దులుపుకుని నిరుద్యోగులను మభ్యపెట్టడానికి  చేస్తున్న ప్రయత్నాలను వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు తిప్పికొట్టాలని సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు.

ఇంటింటా మమేకం కావాలి
రాష్ట్రంలో ప్రజాసమస్యలను తెలుసుకోవడానికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర 11 జిల్లాల్లో పూర్తికావచ్చిందని, పాదయాత్ర 13 జిల్లాల్లో  నవంబరులో పూర్తవుతుందని సుబ్బారెడ్డి తెలిపారు. పాదయాత్రలో దాదాపు 145 నియోజకవర్గాలు పర్యటిస్తారని మిగిలిన 30 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర ఉంటుందన్నారు.  పాదయాత్రలో ప్రజలు పెద్ద సంఖ్యలో తమ సమస్యలను జగన్‌ వద్ద ఏకరువు పెట్టినందున, సమస్యల పరిష్కారానికి పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు ద్వారా  ప్రజలకు మేలు చేయాలన్నారు. ‘రావాలి జగన్‌–కావాలి జగన్‌’ కార్యక్రమం ద్వారా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి ప్రజలతో మమేకం కావాలన్నారు.

సమావేశంలో పార్టీ నరసాపురం పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, భీమవరం, ఉండి, పాలకొల్లు, ఆచంట, తణుకు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, కొవ్వూరు, గోపాలపు రం నియోజవర్గాల పార్టీ కన్వీనర్లు గ్రంధి శ్రీని వాస్, పీవీఎల్‌ నర్సింహరాజు, గుణ్ణం నాగబాబు, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, జి.శ్రీనివాస్‌ నాయుడు, తానేటి వనిత, తలారి వెంకట్రావు, రాజమహేంద్రవరం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కవురు శ్రీనివాస్, పార్టీ నాయకులు జీఎస్‌ రావు, గాదిరాజు సుబ్బరాజు, గూడూరి ఉమాబాల, డాక్టర్‌ వేగేశ్న రామకృష్ణంరాజు, ఇందుకూరి  రామకృష్ణంరాజు, పాతపాటి సర్రాజు, వేండ్ర వెంకటస్వామి, కోడే యుగంధర్, ఏఎస్‌ రాజు తదితరులు పాల్గొన్నారు. 

>
మరిన్ని వార్తలు