నవరత్నాలు ప్రకాశించేలా

18 Sep, 2018 15:03 IST|Sakshi
ఏలూరు మండలం కొమడవోలులో నవరత్నాల పథకాలను వివరిస్తున్న ఎమ్మెల్సీ ఆళ్ల నాని, ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త కోటగిరి శ్రీధర్, నాయకులు

ఊరూవాడా రావాలి జగన్‌

వైఎస్సార్‌ సీపీ కార్యక్రమానికి అనూహ్య స్పందన

పల్లెపల్లెనా ఘన స్వాగతం పలికిన ప్రజలు

జిల్లావ్యాప్తంగా పాదయాత్రలు

సాక్షి ప్రతినిధి,పశ్చిమగోదావరి , ఏలూరు: రావాలి జగన్‌.. కావాలి జగన్‌ అంటూ  సోమవారం జిల్లావ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో పాదయాత్రలు ఉత్సాహపూరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ప్రతి చోటా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు ప్రజ లు నీరాజనాలు పలికారు. ఏలూరులో నియోజకవర్గ కన్వీనర్, ఎమ్మెల్సీ ఆళ్ల నాని, ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్‌ కోటగిరి శ్రీధర్‌ నేతృత్వంలో కొమడవోలు గ్రామంలో పాదయా త్ర చేపట్టి ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను కలుసుకున్నారు. జగన్‌ పాదయాత్రతో అధికార పార్టీ నేతల ఆగడాలు, అక్రమాలను ఎదిరించే నాయకుడు ఒకడున్నాడనే ధైర్యం ప్రజల్లో లిగిందని ఆళ్ల నాని అన్నారు. రానున్న రోజుల్లో గ్రామస్థాయి నాయకుడి నుంచి జిల్లా, పార్లమెంటరీ స్థాయి నాయకుడు వరకూ ప్రతి ఒక్కరూ పాదయాత్ర చేపట్టి ప్రజల వద్దకు వెళ్లాలని పిలుపునిచ్చారు. కోటగిరి శ్రీధర్‌ మాట్లాడుతూ అధికార పార్టీ నాయకుల ఆగడాలకు బలైపోతున్న బాధితులకు అండగా ఉంటామన్నారు. టీడీపీ నాయకుల అవినీతి, అక్రమాలను ప్రజా మద్దతుతో ఎండగట్టాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

పోలవరం నియోజకవర్గంలోని పోలవరం మండలంలో మారుమూల గ్రామమైన పైడాకులమామిడిలో రావాలి జగన్‌.. కావాలి జగన్‌ నినా దంతో సమన్వయకర్త తెల్లం బాలరాజు ఆధ్వర్యం లో గడపగడపకూ నవరత్నాల ప్రచార కార్యక్రమం జరిగింది. బాలరాజు గ్రామంలోని ఇంటిం టా తిరిగి ప్రజాసమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు నవరత్నాల పథకాలను వివరించారు.

తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి గ్రామంలో రావాలి జగన్‌.. కావాలి జగన్‌ కార్యక్రమం నియోజకవర్గ కన్వీనర్‌ కొట్టు సత్యనారాయణ నాయకత్వంలో జరిగింది. గ్రామంలో తొలుత బూత్‌ కమిటీ కన్వీనర్లతో మాట్లాడిన కొట్టు అనంతరం గ్రామంలో ఇంటింటికీ వెళ్లి సంక్షేమ కార్యక్రమాల అమలులో వైఎస్‌ పాలనకు, చంద్రబాబు పాలనకు మధ్య  వ్యత్యాసాన్ని గుర్తించాలని ప్రజలను కోరారు. ప్రతి కుటుం బానికి లక్ష నుంచి ఐదు లక్షల రూపాయలు లబ్ధి చేకూర్చేలా జగన్‌ నాయకత్వంలో రూపొందించిన నవరత్నాల పథకం ద్వారా  అన్నివర్గాలకూ మేలు జరుగుతుందని, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు.
పాలకొల్లు నియోజకవర్గ కన్వీనర్‌ గుణ్ణం నాగబాబు నేతృత్వంలో యలమంచిలి మండలంలోని గుంపర్రు గ్రామంలో రావాలి జగన్‌.. కావాలి జగన్‌ కార్యక్రమం నిర్వహించారు. రెండో రోజు వర్షంలోనూ వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని నాగబాబు వెంట ఇంటింటా తిరుగుతూ నవరత్నాల పథకాల గురించి వివరించారు.

ఉంగుటూరు నియోజకవర్గ కేంద్రమైన ఉం గుటూరులో రావాలి జగన్‌.. కావాలి జగన్‌ కార్యక్రమానికి నియోజకవర్గ కన్వీనర్‌ పుప్పాల వాసుబాబు శ్రీకారం చుట్టారు. స్థానిక పంచాయతీ కమ్యూనిటీ హాలులో జరిగిన బూత్‌ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో 22, 23 బూత్‌ కేంద్రాల పరిధిలో ఆయన ఇంటింటికీ వెళ్లి నవరత్నాలు గురించి వివరించారు. వర్షం కురుస్తున్నా ఏ మాత్రం లెక్కజేయకుండా వాసు బాబు ముందుకు సాగారు.

చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త వీఆర్‌ ఎలీజా నేతృత్వంలో చింతలపూడి మండలం చింతంపల్లి, మేడిశెట్టివారిపాలెం గ్రామాల్లో రావాలి జగన్‌.. కావాలి జగన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికీ తిరిగి నవరత్నాల పథకాలను సమన్వయకర్త ఎలీజా ప్రజ లకు వివరించారు.

గోపాలపురం నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు నేతృత్వంలో  గోపాలపురం మండలం గోపవరంలో రావాలి జగన్‌.. కావాలి జగన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దివంగత సీఎం వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం సర్వమత ప్రార్థనలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.  ఈ సందర్భంగా పలువురు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.
దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త కొఠారు అబ్బయ్యచౌదరి పెదవేగి మండలం రా ట్నాలకుంటలో రావాలి జగన్‌ కార్యక్రమాన్ని ప్రా రంభించారు. రాట్నాలమ్మవారికి, సాయిబాబాకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గ్రామంలో ఇంటింటా తిరిగి వైఎస్సార్‌ సీపీ నవరత్నాల పథకాలు, టీడీపీ అవినీతి, అక్రమాలను వివరిం చారు. భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు.

మరిన్ని వార్తలు