నేను దీక్ష చేస్తా : మాజీ మంత్రి రావెల

5 Jul, 2018 12:08 IST|Sakshi

సాక్షి, గుంటూరు : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై సుప్రీం తీర్పుకు నిరసనగా ఈ నెల 23న దీక్ష చేయనున్నట్లు మాజీ మంత్రి రావెల కిషోర్‌ బాబు తెలిపారు. అట్రాసిటీ చట్టంపై సుప్రీంకోర్టు తీర్పు వల్ల చట్టం బలహీన పడిందని, కోరలు పీకిన పులి లాగా అట్రాసిటీ  చట్టం తయారైందన్నారు. సుప్రీం కోర్టు తీర్పుతో, దేశ వ్యాప్తంగా దళితులలో అభద్రతభావం ఏర్పడిందని చెప్పారు. ఏపీలో కూడా దళితులపై వరుస దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర ఆందోళనలో ఉన్న  గిరిజనులకు భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాలలో అట్రాసిటీ చట్టానికి తగిన భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఇందుకోసం కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు తాను దీక్షకు కూర్చోనున్నట్లు రావెల ప్రకటించారు.

మరిన్ని వార్తలు