చైనా నుంచి వచ్చిన రాయచోటి విద్యార్థిని

28 Jan, 2020 12:35 IST|Sakshi

చైనా నుంచి వచ్చిన రాయచోటి విద్యార్థిని

ఆమె ఆరోగ్యవంతురాలు అని తేల్చిన పరీక్షలు

కడప రూరల్‌: తాజాగా ‘కరోనా’ ప్రపంచాన్ని వణికిస్తోంది. పొరుగు దేశం చైనాలో తొలిసారి ఇది వెలుగు చూసింది.  ఈ వ్యాధి దాదాపుగా ‘స్వైన్‌ ఫ్లూ’ లక్షణాలను కలిగి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. చైనా, తైవాన్‌ తదితర ప్రాంతాల్లో మన జిల్లాకు చెందిన వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. రాకపోకలు సాగిస్తుంటారు. ఇటీవల కొంతమంది సంక్రాంతికి వచ్చి వెళ్లిన వారు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. మూడు రోజుల క్రితం చైనాలో వైద్య విద్యను అభ్యసిస్తున్న ఒక అమ్మాయి రాయచోటికి వచ్చింది. 

వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అమెను మూడు రోజుల బయటకు రానీకుండా ఇంటిలోనే ఉంచారు. అమె ఆరోగ్య పరిస్ధితిని పరీక్షించి ఆరోగ్యంగా ఉన్నట్లు నిర్ధారించుకున్నారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.  కరోనా వ్యాధిపై ప్రభుత్వం ఇటీవల అమరావతిలో ఒక ‘నిఘా వ్యవస్ధ’ను ఏర్పాటు చేసింది. వైద్య ఆరోగ్య శాఖలను అప్పమత్తం చేసింది.  చైనా తదితర ప్రాంతాల నుంచి వస్తే సమాచారం ఎయిర్‌ పోర్ట్‌ అధారిటీ ద్వారా ‘నిఘా వ్యవస్ధ’కు చేరుతుంది. సదరు వ్యక్తిని 28 రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచుతారు. ఇప్పటికే ఇటు కేరళ, అటు హైదరాబాద్‌లో ‘కరోనా’ బాధితులు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.  ప్రజలు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను పాటించడం మంచిదని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ ఉమాసుందరి సూచించారు.  

>
మరిన్ని వార్తలు