ఆశ వదులుకున్న రాయపాటి!

9 Dec, 2014 18:58 IST|Sakshi
రాయపాటి సాంబశివరావు

న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ నరసరావుపేట లోక్సభ సభ్యుడు  రాయపాటి సాంబశివరావు టీటీడి చైర్మన్ పదవిపై ఆశవదులుకున్నారు. టీటీడి చైర్మన్ పదవిపై తనకు ఆసక్తి లేదని చెప్పారు. ఆ రేసులో తాను లేనని రాయపాటి తెలిపారు.

ఈ పదవిపై రాయపాటి  గంపెడు ఆశలు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఆ పదవి తనకు ఇవ్వమని ఆయన గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కోరారు. టీటీడీ ఛైర్మన్గా ఒక్కసారైనా పని చేయాలన్నది తన జీవితాశయమని, అయితే ఆ కోరిక ఇంతవరకూ నెరవేరలేదని కూడా ఆయన బాబుకు తెలిపారు.  

 టీటీడీ ఛైర్మన్ పదవిపై మాజీ ఎమ్మెల్యేలు చదలవాడ కృష్ణమూర్తి, గాలి ముద్దుకృష్ణమ నాయుడు, రాజమండ్రి ఎంపి మురళీ మోహన్, సినీనటుడు శివాజీ, నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర యాదవ్.... ఇలా చాలా మంది ప్రయత్నించారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చదలవాడ కృష్ణమూర్తి పేరుని ఖరారు చేసినట్లు తెలిసింది. దాంతో రాయపాటి ఆ పదవిపై ఆశలు వదులుకున్నారు.
**

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు